వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్ష బీభత్సం: 77 మంది మృతి.. తెలంగాణ, మహారాష్ట్రలో ఇలా.

|
Google Oneindia TeluguNews

వర్ష బీభత్సం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. బుధవారం నుంచి తెలంగాణ, మహారాష్ట్రలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో రెండు రాష్ట్రాల్లో 77 మంది చనిపోయారు. ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జనం వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయా చోట్ల డ్యాములు నిండుతున్నాయి.

అయితే తెలంగాణ రాష్ట్రంపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. బుధవారం నుంచి 50 మంది చనిపోయారు. గురువారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిచారు. రాష్ట్రంలో 5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. తక్షణసాయం కింద సహాయ పునరావాస సాయం కోసం రూ.1350 కోట్లు ఇవ్వాలని కోరారు.

 Rain fury claims 77 lives in Telangana, Maharashtra..

ఇటు మహారాష్ట్రలో కూడా 27 మంది చనిపోయారు. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్ విధించింది. పశ్చిమ మహారాష్ట్ర, మరాట్వాడాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.

Recommended Video

Hyderabad Floods Remembering 1908 Musi Floods That Changed Face of Hyderabad || Oneindai Telugu

తెలంగాణలో చనిపోయిన 50 మందిలో 11 మంది హైదరాబాద్‌కి చెందిన వారే ఉన్నారు. 20 వేల 540 ఇళ్లు ధ్వంసం అయ్యాి. 144 కాలనీలు, 72 ప్రాంతాలపై వర్ష ప్రభావం చూపింది. ఒక్క హైదరాబాద్‌లో 35 వేల కుటుంబాలపై ఎఫెక్ట్ చూపించింది.

English summary
Heavy rains have wreaked havoc in several southern states of India. Torrential rains since Wednesday have killed at least 77 people in Telangana and Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X