Rain: వాన దెబ్బతో ‘బెంగ’ పెట్టుకున్న ‘బెంగళూరు’ ప్రజలు, ఐటీ హబ్ లో ఎల్లో అలర్ట్, జలక్.. జలక్, నీళ్లలో !
బెంగళూరు/తిరుపతి/చెన్నై: తమిళనాడులోని వానల దెబ్బ ప్రభావంతో ఐటీ హబ్ బెంగళూలో మంగళవారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం మద్యాహ్నం నుంచి వాన నిలిచి నిలిచిపడింది. రాత్రి మొదలై భారీ వర్షం బుధవారం వేకువ జామున వరకు కురిసింది. ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు వర్షం నీరు రోడ్ల మీదకు రావడంతో జలమయం అయ్యాయి. బెంగళూరులోని అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోని నీళ్లు చేరిపోవడంతో జలమయం అయ్యాయి. బెంగళూరులోని పలు రహదారుల మీద అడుగుల ఎత్తులో నీళ్లు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. పాదచారులు, వాహనచోదకులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ల మీద నిలిపిన కార్లు అర్దం మునిగిపోయాయి. బుధవారం బెంగళూరులో ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వాతావరణ శాఖ అధికారులు బెంగళూరులో ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో బీబీఎంపీ అధికారులు, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, అటవి శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
Khiladi
wife:
ఉద్యోగం
చేస్తున్న
చోట
భార్యకు
ప్రియుడు,
ఇంట్లో
శవమైన
మొగుడు,
ఫోన్
కాల్స్
దెబ్బతో
!

తమిళనాడు దెబ్బతో బెంగళూరులో జలక్ జలక్
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బ ప్రభావంతో ఐటీ హబ్ బెంగళూలో మంగళవారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం మద్యాహ్నం నుంచి వాన నిలిచి నిలిచిపడింది. రాత్రి 8 గంటలకు మొదలై భారీ వర్షం బుధవారం వేకువ జామున వరకు కురిసింది. భారీ వర్షాల దెబ్బతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బెంగళూరులో ఎల్లో అలర్ట్
బుధవారం బెంగళూరు నగరంతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లా, చుట్టుపక్కల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వాతావరణ శాఖ అధికారులు బెంగళూరులో ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో బీబీఎంపీ అధికారులు, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, అటవి శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు.

జలమయం అయిన బెంగళూరు రోడ్లు
ఐటీ
హబ్
బెంగళూరు
నగరంలోని
అనేక
ప్రాంతాలు
వర్షం
నీరు
రోడ్ల
మీదకు
రావడంతో
జలమయం
అయ్యాయి.
బెంగళూరులోని
అనేక
ప్రాంతాల్లోని
లోతట్టు
ప్రాంతాల్లో
ఇళ్లలోని
నీళ్లు
చేరిపోవడంతో
జలమయం
అయ్యాయి.
బెంగళూరులోని
పలు
రహదారుల
మీద
అడుగుల
ఎత్తులో
నీళ్లు
నిలిచిపోవడంతో
చెరువులను
తలపించాయి.
పాదచారులు,
వాహనచోదకులు
నానా
ఇబ్బందులు
ఎదుర్కొన్నారు.

బురద నీరు.... డ్రైనేజ్ నీరు దెబ్బతో రోడ్ల మీద దుర్వాసన
బెంగళూరు నగరంలో మెట్రో రైలు పనులు జోరుగా జరుగుతున్నాయి. మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తో ఇప్పటికే వాహనచోదకులు నానాఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బ తినడం, వర్షం నీరు రోడ్ల మీదకు రావడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులకు గురౌతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

నాలుగు రోజులు భారీ వర్షాలు !
మొత్తం మీద బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు. 10 రోజుల నుంచి బెంగళూరులో ప్రతిరోజు వానలు కురుస్తున్నాయి. ఇప్పుడు వరుసగా భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రజలు హడలిపోతున్నారు.