• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు దర్యాప్తు .. హెచ్ అకౌంట్ లావాదేవీలు, చిన్న సంస్థలతో 70 పోర్న్ వీడియోలు

|

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణం కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజా విచారణలో రాజ్ కుంద్రా 70 అశ్లీల వీడియోలను నిర్మించినట్టు ముంబై పోలీసులు గుర్తించారు. వివిధ ప్రొడక్షన్ హౌసెస్ నిర్మించిన ఈ వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వన్ ప్రాపర్టీ సెల్ కింద దర్యాప్తు చేస్తున్నారు.

 హాట్ షాట్ కోసం చిత్రీకరించిన వీడియోలను పరిశీలిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు

హాట్ షాట్ కోసం చిత్రీకరించిన వీడియోలను పరిశీలిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు


శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా యాజమాన్యంలోని హాట్‌షాట్‌ యాప్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. ఈ వీడియోలలో కొన్ని 20 నుండి 30 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉన్నాయి అని పోలీసులు వెల్లడిస్తున్నారు. దర్యాప్తు చేయబడుతున్న వీడియోలలోని దృశ్యాలు ఏవీ సెక్స్ లో పాల్గొంటున్న ఇద్దరు వ్యక్తులను చూపించనందున, వాటిని పోర్న్ అని వర్గీకరించలేమని కుంద్రా యొక్క న్యాయవాది కోర్టులో పేర్కొన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం అవి పోర్న్ అని చెప్తున్నారు.

కుంద్రా ఆదేశాలతో స్మాల్ పొడక్షన్ హౌస్ ల ద్వారా 70 వీడియోలు , వాటిపై పోలీసుల నిఘా

కుంద్రా ఆదేశాలతో స్మాల్ పొడక్షన్ హౌస్ ల ద్వారా 70 వీడియోలు , వాటిపై పోలీసుల నిఘా

రాజ్ కుంద్రా ఆదేశాల మేరకు చిన్న తరహా నిర్మాణ సంస్థల ద్వారా ఈ వీడియోలను ప్రొడ్యూస్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రొడక్షన్ హౌస్ లు అన్ని నిఘా నీడలో ఉన్నట్లుగా సమాచారం. అశ్లీల చిత్రాలను సృష్టించి, కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకు వెళ్తున్న కేసులో రాజ్ కుంద్రాను జూలై 19 న ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం), 292 మరియు 293 (అశ్లీల మరియు అసభ్య ప్రకటనలు మరియు ప్రదర్శనలకు సంబంధించినవి) కింద , ఐటి చట్టం మరియు అసభ్య ప్రాతినిధ్యం యొక్క సెక్షన్లతో పాటుగా, మహిళల (నిషేధ) చట్టం. అతనిపై కేసు నమోదైంది. కుంద్రా జూలై 23 వరకు పోలీసుల అదుపులో ఉండనున్నారు.

  Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
  హెచ్ అకౌంట్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో లావాదేవీలపై ఆరా

  హెచ్ అకౌంట్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో లావాదేవీలపై ఆరా

  ఇప్పటికే బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు . ఈజీ మనీ కోసమే రాజ్ కుంద్రా ఈ పని చేశారా ? లేక ఇంకా ఎవరికైనా దీనిలో ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . హెచ్ అకౌంట్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో లావాదేవీలు సంగతేంటి ? దానికి అడ్మిన్ గా రాజ్ కుంద్రా ఎందుకు ఉన్నారు ? మోడల్స్ కు ఇచ్చినట్టుగా చెబుతున్న రెమ్యూనరేషన్ లెక్కలకు ఆయన ఏం వివరణ చెప్తారు అనేది ? ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  నెలకు 60 లక్షల రూపాయల సంపాదన ఉందని బాలీవుడ్ లో టాక్

  నెలకు 60 లక్షల రూపాయల సంపాదన ఉందని బాలీవుడ్ లో టాక్

  ఇదే సమయంలో పోర్న్ ఫిలిమ్స్ ద్వారా రాజ్ కుంద్రా గ్యాంగ్ నెలకు 60 లక్షల రూపాయల వరకు సంపాదిస్తోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా తీగ లాగుతున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బాలీవుడ్ పోర్నోగ్రఫీ గుట్టును రట్టు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి మాత్రం నోరు మెదపలేదు. ఇక ఈ రాకెట్ లో ఆమె ప్రమేయం లేదని పోలీసులు కూడా చెప్తున్నారు.

  English summary
  Shilpa Shetty's husband Raj Kundra, who was arrested in a pornography case and is currently under investigation by the Mumbai Crime Branch police. Mumbai police have found that Raj Kundra produced 70 pornographic videos during the latest investigation. Police are examining these videos produced by various production houses. Transactions in the WhatsApp group named H Account are also being investigated.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X