• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు : నటి శిల్పా శెట్టి పాత్ర, ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఏమన్నారంటే !!

|

లండన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అశ్లీల ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించారు. లైవ్ స్ట్రీమింగ్ యాప్ లు, ఐపీఎల్ లు పెద్దగా కలిసి రాకపోవడంతో తప్పుదారిలో సంపాదన కోసం రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ ను కొన్ని యాప్ ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నట్లుగా, ఈ పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే ప్రధాన సూత్రధారిగా పోలీసులు ప్రాధమికంగానిర్ధారించారు. దీంతో ఆయనను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఢిల్లీలో హై అలెర్ట్ .. పార్లమెంట్ సమావేశాలు , ఆగస్ట్ 15 వేడుకలు..డ్రోన్ల ద్వారా ఉగ్ర దాడులకు ప్లాన్ !!ఢిల్లీలో హై అలెర్ట్ .. పార్లమెంట్ సమావేశాలు , ఆగస్ట్ 15 వేడుకలు..డ్రోన్ల ద్వారా ఉగ్ర దాడులకు ప్లాన్ !!

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి పాత్ర లేదన్న ముంబై పోలీసులు

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి పాత్ర లేదన్న ముంబై పోలీసులు

ముంబై మరియు పరిసర ప్రాంతాల్లో మోడల్స్ ను ట్రాప్ చేసి వారితో చిత్రీకరించిన అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసే హాట్‌షాట్స్ యాప్ అనే మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ను స్ట్రీమింగ్ చేసినట్లు రాజ్ కుంద్రా పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమైన సందర్భంలో ముంబై పోలీసులు ఇంతవరకు ఈ కేసులో శిల్పాశెట్టి పాత్ర లేదని పేర్కొన్నారు .శిల్పా శెట్టి యొక్క చురుకైన పాత్రను మేము ఇంకా కనుగొనలేకపోయాము. లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.బాధితులు ముందుకు వచ్చి క్రైమ్ బ్రాంచ్ ముంబైని సంప్రదించమని మేము విజ్ఞప్తి చేస్తామని, తాము తగిన చర్యలు తీసుకుంటామని సంయుక్త కమిషనర్ పోలీసులు (క్రైమ్), మిలింద్ భరంబే అన్నారు.

హాట్ షాట్ యాప్ తో అశ్లీల కంటెంట్ .. కీలక సూత్రధారి రాజ్ కుంద్రా

హాట్ షాట్ యాప్ తో అశ్లీల కంటెంట్ .. కీలక సూత్రధారి రాజ్ కుంద్రా

ఫిబ్రవరి 2019 లో, రాజ్ కుంద్రా ఆర్మ్స్ ప్రైమ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించారు.ఆరు నెలల తరువాత, కంపెనీ హాట్‌షాట్ అనే మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీనికి పోలీసులు పోర్న్ స్ట్రీమింగ్ యాప్ అని పేరు పెట్టారు. ఈ యాప్ కుంద్రా యొక్క బంధువు పర్దీప్ బక్షి యాజమాన్యంలోని లండన్ కేంద్రంగా ఉన్న కెన్రిన్ లిమిటెడ్‌కు $ 25,000 కు విక్రయించబడింది.2019 డిసెంబర్‌లో కుంద్రా ఆర్మ్స్ ప్రైమ్ మీడియాకు రాజీనామా చేశారు. అయితే కుంద్రా మూడు వాట్సాప్ గ్రూపుల ద్వారా హాట్ షాట్ యాప్ యొక్క మొత్తం ఆపరేషన్‌ను నిర్వహించేవారు .

 హాటెస్ట్ సెలబ్రిటీల అశ్లీల కంటెంట్ .. యాప్ ను తొలగించిన గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్

హాటెస్ట్ సెలబ్రిటీల అశ్లీల కంటెంట్ .. యాప్ ను తొలగించిన గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్

హాట్‌షాట్‌ యాప్ ను జూన్ 2020 లో ఆపిల్ యాప్ స్టోర్ తొలగించింది . గూగుల్ ప్లే స్టోర్ నవంబర్ 2020 లో యాప్ ను తీసివేసింది. అందులో ఉంటున్న అశ్లీల కంటెంట్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి, యాపిల్ యాప్ స్టోర్ నుండి తొలగించింది. ఈ యాప్ ప్రపంచం నలుమూలల నుండి హాటెస్ట్ సెలబ్రిటీల యొక్క ప్రత్యేకమైన మరియు పోర్న్ లఘు చిత్రాలు, హాట్ ఫోటోలు మరియు వీడియోలను అందిస్తుంది. ఈ యాప్ కోసం కంటెంట్ సృష్టి బాధ్యత అంతా రాజ్ కుంద్రాదే.

  Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
   రాజ్ కుంద్రా తో పాటు మరొక 11 మంది అరెస్ట్ .. శిల్పాశెట్టిపై బాలీవుడ్ లో చర్చ

  రాజ్ కుంద్రా తో పాటు మరొక 11 మంది అరెస్ట్ .. శిల్పాశెట్టిపై బాలీవుడ్ లో చర్చ

  ఇక ఈ కేసులో వియాన్ ఇండస్ట్రీస్, కుంద్రా యొక్క బావమరిది యాజమాన్యంలోని కెన్రిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇప్పటివరకు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం ఆపరేషన్‌లో యుకెకు చెందిన సంస్థ ముందున్నప్పటికీ, షూటింగ్‌ను కుంద్రా సంస్థ చేసేది, అయితే ఈ టోటల్ ఆపరేషన్ కు సంబంధించిన డబ్బు కెన్రిన్ పేరిట వచ్చేదని తేల్చింది. మొత్తానికి ఇప్పటి వరకు పోర్నోగ్రఫీ కంటెంట్ ను అప్లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలతో రాజ్ కుంద్రా తో పాటు మరొక 11 మంది అరెస్ట్ చేసి బాలీవుడ్ ను కుదిపేసిన ఈ కేసులో నటి శిల్పాశెట్టి పాత్ర లేనట్టుగా పోలీసులు చెప్తున్నారు.

  English summary
  Actor Shilpa Shetty's husband and businessman Raj Kundra arrested in connection with a pornographic film racket has been remanded to police custody till July 23 on Tuesday. So far, Mumbai police have not found any active role of Shilpa Shetty in the case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X