వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్ ఘడ్‌ లో ఎన్ కౌంటర్ పై రాజ్ నందగావ్ ఎస్పీ జితేంద్ర శుక్లా ఏమన్నారంటే !!

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఎన్ కౌంటర్ జరిగింది. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోనీ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, సాయుధ పోలీసులకు కు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఎస్సై , నలుగురు మావోయిస్టులు మృతి చెందారు . ప్రస్తుతం ఇంకా ఆ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది. పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. నిన్న రాత్రి నుండి పర్ధోనీ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలో అక్కడ ఉన్న మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఇక పోలీసులు సైతం తుపాకీలకు పని చెప్పారు. మామదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ నేతృత్వంలో పోలీసులు మావోయిస్టుల కదలికల సమాచారంతో శుక్రవారం రాత్రి మన్పూర్‌ నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం వెళ్ళారు. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులతో పాటు, ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

స్పాట్.. తుపాకుల మోతతో దద్దరిల్లిన ఎంఎంసీ జోన్.. నలుగురు మావోలు,ఒక ఎస్ఐ మృతి..స్పాట్.. తుపాకుల మోతతో దద్దరిల్లిన ఎంఎంసీ జోన్.. నలుగురు మావోలు,ఒక ఎస్ఐ మృతి..

ఒక ఎస్సై తో పాటు నలుగురు మావోయిస్ట్ పార్టీ సభ్యులు మృతి పై ఎప్సీ శుక్లా

ఒక ఎస్సై తో పాటు నలుగురు మావోయిస్ట్ పార్టీ సభ్యులు మృతి పై ఎప్సీ శుక్లా

చత్తీస్ ఘడ్ రాజ్ నందగావ్ జిల్లాలో జరిగిన కాల్పులలో పోలీసుల సబ్-ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాదు సిపిఐ (మావోయిస్ట్) యొక్క డివిజనల్ కమిటీ సభ్యుడు సహా నలుగురు మావోయిస్టులు మరణించారని అధికారులు శనివారం తెలిపారు.సమాచారం తెలుసుకున్న ఎస్పీ జితేంద్ర శుక్లా సంఘటనా స్థలానికి వెళ్లారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కోసం పోలీసు బృందం బయలుదేరినప్పుడు మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని గ్రామానికి సమీపంలో ఉన్న అరణ్యాలలో రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఎస్పీ చెప్పారు .

 మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం

మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం

మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల గురించి వచ్చిన సమాచారం మేరకు పట్టుకోవడానికి వెళ్ళిన బృందం పర్ధోనిని చుట్టుముట్టినప్పుడు, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని , ప్రతిగా ప్రాణరక్షణ కోసం తాము కూడా కాల్పులు జరిపామని పోలీసులు చెప్తున్నారు . ఇకే ఈ ఎన్ కౌంటర్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.కె.శర్మ మావోయిస్టు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడని రాజ్ నందగావ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) జితేంద్ర శుక్లా అన్నారు.ఇక శర్మ సుర్గుజా జిల్లా నివాసి శర్మ కూడా మదన్వాడ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.

మృతుల్లో డివిజనల్ కమిటీ సభ్యుడు అశోక్‌ తో పాటు మరో ముగ్గురు మావోలు

మృతుల్లో డివిజనల్ కమిటీ సభ్యుడు అశోక్‌ తో పాటు మరో ముగ్గురు మావోలు

ఇక ఈ ఎన్ కౌంటర్ లో డివిజనల్ కమిటీ సభ్యుడు అశోక్‌ను, సిపిఐ (మావోయిస్టు) ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్న కృష్ణను వారు కాల్చి చంపారని శుక్లా తెలిపారు. మృతుల్లో ఇద్దరు సరిత మరియు ప్రమీల జూనియర్ కార్యకర్తలు మరియు పార్టీ సభ్యులుగా పనిచేస్తున్నారు అని ఆయన చెప్పారు. మావోయిస్టులను గెరిల్లా వ్యూహాలతో సమర్థవంతంగా దాడులు చేయగల సీఆర్పీఎఫ్ పోలీసులు ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. ప్రత్యేక దళాలతో కూంబింగ్ కొనసాగుతోంది. దీంతో సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

English summary
A sub-inspector of police lost his life and four Maoists, including a divisional committee member of CPI(Maoist), were killed during a gunfight in Chhattisgarh’s Rajnandgaon district on Friday night, SP Shukla said they have gunned down Ashok, the divisional committee member, and Krishna, who was the area committee member of CPI (Maoist).“Two other woman cadres, Sarita and Pramila, were junior cadres and working as party members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X