వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీకి దూరం ? కారణమిదేనా ..?

|
Google Oneindia TeluguNews

ముంబై : ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే సంచనల నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ పోటీచేయబోదనని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఆ పార్టీ నేత శిరీష్ సావంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రకు చెందిన ప్రాంతీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి రాజ్ థాకరే మద్దతు తెలిపే అవకాశం ఉంది.

 ఎన్సీపీకి మద్దతు ?

ఎన్సీపీకి మద్దతు ?

రేపు మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ ర్యాలీ నిర్వహించనుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీకి మద్దతు ఇస్తామని ర్యాలీలో రాజ్ థాకరే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో .. రాజ్ థాకరే సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ రాష్ట్రంలో కొన్ని చోట్ల పోటీ చేయాలని పవార్ కోరితే .. ఎంఎన్ఎస్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

ఉత్తరాదిలో నష్టమని దూరం ..

ఉత్తరాదిలో నష్టమని దూరం ..

ముంబైలో స్థానికులే ఉండాలనే నినాదంతో ముందుకెళ్తోంది ఎంఎన్ఎస్. ఈ క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు ఉత్తరాదిలో ఓటు బ్యాంకు కొల్లగొడుతోందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకే రాజ్ థాకరేతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. అందుకే ఆ పార్టీని కూటమిలోకి కూడా తీసుకొచ్చేందుకు అయిష్టత వ్యక్తం చేసింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మెతకవైఖరి అవలంభించింది. గత వారం మహారాష్ట్రలో పర్యటించిన రాహుల్ గాంధీ .. తమ కూటమిలో చేరే పార్టీలకు ఓపెన్ ఆఫర్ చేశారు. ఆ సమయంలో ఎంఎన్ఎస్ పార్టీ మళ్లీ తిరిగి జట్టుకడుతుందని భావించినా .. రాజ్ థాకరే మాత్రం దూరంగానే ఉన్నారు.

గోవా సీఎం రేసులో విశ్వజిత్ రాణే, ప్రమోద్ సావంత్గోవా సీఎం రేసులో విశ్వజిత్ రాణే, ప్రమోద్ సావంత్

ఒక్కస్థానంలో పోటీ ?

ఒక్కస్థానంలో పోటీ ?

ఎన్సీపీకి మద్దతిస్తూనే ఒక పార్లమెంట్ స్థానంలో పోటీచేయాలని ఎంఎన్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరుపార్టీల మధ్య పోటీపై చర్చ రాదని ... అలాగే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రాజ్ థాకరే ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. 2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ కు 13 స్థానాల్లో గెలువగా .. 2014లో అది ఒక్కసీటుకే పరిమితమైంది.

English summary
The Maharashtra Navnirman Sena (MNS), led by Raj Thackeray, has decided not to contest the upcoming Lok Sabha elections. MNS leader Shirish Sawant issued a statement in this regard on Sunday. Sources said Thackeray may declare support to the Sharad Pawar-led Nationalist Congress Party (NCP) in the MNS rally on March 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X