వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజా హరిసింగ్‌కు భారతరత్న ప్రకటించండి..ఆయన వల్లే ఇది జరిగింది: విక్రమాదిత్యసింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాజా హరిసింగ్... జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో ప్రముఖంగా వార్తల్లో వినిపించిన పేరు. నాడు శతృవులు జమ్మూకశ్మీర్‌పై దండయాత్రకు వచ్చినప్పుడు, అప్పటి జమ్మూకశ్మీర్ మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వం సహాయం కోరాడు. అంతేకాదు తన రాజ్యాన్ని భారత్‌లో కలుపుతానని చెప్పాడు. కొన్ని షరతులపై అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భారత సైన్యాన్ని రంగంలోకి దింపారు.

కోర్టు మొట్టికాయలు పడితే తప్ప.. న్యాయస్థానం మెట్లెక్కని నేత...కోర్టు మొట్టికాయలు పడితే తప్ప.. న్యాయస్థానం మెట్లెక్కని నేత...

మహారాజా హరిసింగ్‌కు భారతరత్న ఇవ్వాలి

మహారాజా హరిసింగ్‌కు భారతరత్న ఇవ్వాలి

సీన్ కట్ చేస్తే నేడు మహారాజా హరిసింగ్‌‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన మనవడు కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్. అంతేకాదు ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 23ను ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని కోరుతున్నారు. తన తాత మహారాజ హరిసింగ్ వల్లే జమ్మూకశ్మీర్ భారత్‌లో విలీనమైందన్నారు. నాడు జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం సమక్షంలో రాజా హరిసింగ్ సంతకాలు చేశారు. భారతరత్న తన తాతకు ఇవ్వడం ద్వారా ఆయనకు గౌరవం ఇచ్చినవారం అవుతామని విక్రమాదిత్యసింగ్ తెలిపారు.

 1947లో ఇన్స్‌ట్రుమెంటేషన్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకాలు

1947లో ఇన్స్‌ట్రుమెంటేషన్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకాలు

గతవారం విక్రమాదిత్య తండ్రి కరణ్ సింగ్‌ కూడా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిసి సెప్టెంబర్ 23ను రాజా హరిసింగ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. కొన్నేళ్ల క్రితమే దీన్ని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కరణ్ సింగ్ తెలిపారు. అక్టోబర్ 26, 1947లో జమ్మూకశ్మీర్‌ను భారత్‌లోకి విలీనం చేస్తూ రాజా హరిసింగ్ ఇన్స్‌ట్రుమెంటేషన్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకాలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజల కోసం తన తండ్రి రాజా హరిసింగ్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని దూరదృష్టితో వ్యవహరించి సుపరిపాలన అందించారని కరణ్ సింగ్ తెలిపారు.

అన్ని వర్గాల వారికి సుపరిపాలన అందించిన రాజా హరిసింగ్

అన్ని వర్గాల వారికి సుపరిపాలన అందించిన రాజా హరిసింగ్

ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్సీ అయిన విక్రమాదిత్య సింగ్.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పట్ల కేంద్రప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చారు. అంతేకాదు జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రజలకు ఇది కొత్త శఖం అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలు, ఇతర మైనార్టీ వర్గాలవారు జమ్మూ కశ్మీర్‌లో స్వతంత్రంగా జీవించే హక్కు ఉంటుందన్నారు.ఈ అవకాశాన్ని ఆయుధంగా మలుచుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో జమ్మూకశ్మీర్ అభివృద్ధి చెందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు విక్రమాదిత్యసింగ్ తెలిపారు.

English summary
Congress leader Vikramaditya singh had demanded the central Govt that his grandfather Maharaja Hari Singh be honoured with India's highest civilian award Bharat Ratna.He said that because of Raja Hari Singh Jammu Kashmir is now a psrt of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X