వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ ఇష్యూపై ఏమంటారు, అవార్డు వాపసీకి మోదీ సూటి ప్రశ్న

|
Google Oneindia TeluguNews

ఘజిపూర్ : ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకొన్న నేపథ్యంలో అధినేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధాని మోదీ తాజాగా విపక్ష కాంగ్రెస్‌పై ఒంటికాలిపై లేచారు. రాజస్థాన్‌లో దళిత బాలికపై లైంగికదాడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

rajastan incident if any action taken modi asks

అరెస్ట్ చేశారా ?
నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. వారిపై యాక్షన్ తీసుకోవడంలో జాప్యానికి కారణమేంటని నిలదీశారు. మోదీ శనివారం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. దీంతోపాటు గతంలో అసహనం అని, అవార్డులను వెనక్కి ఇచ్చిన ప్రముఖులు ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగారు. ఓ దళిత బాలికపై లైంగికదాడి జరిగితే .. మీ అవార్డులను వెనక్కి ఇచ్చేయారా ? మీ వద్దే ఉంచుకుంటారా అని ప్రశ్నించారు.

అందుకే అలా ..
వెనుకబడిన వర్గానికి చెందిన తాను ప్రధానిగా ఉంటే జీర్ణించుకోలేని ప్రముఖులు అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఏమైంది ? అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని సూచించారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వాలని కోరారు.

మానవత్వం
మరో శోన్ భద్ర సభలో ప్రసంగిస్తూ .. తనది ఏ కులం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వారికి వేదికపై నుంచి ఒక్కటే చెబుతున్నా ... దేశంలో పేదలందరిదీ ఒక్కటే కులం అని ప్రజల కరతాళధ్వనల మధ్య ప్రకటించారు. దేశంలో ఉన్న ఆ పేదల కులమో ఏదో .. తనది అదే కులమని పేర్కొన్నారు.

English summary
two weeks ago, a woman from dalitcomuity was gang raped in alwar, instead of apprehending the culprits, rajastan govt and the police started to to suppress the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X