వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ ఉప ఎన్నికల తీర్పు.. ’19కి సంకేతమా? వసుంధరా సర్ధుకోవల్సిందేనా?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

జైపూర్/న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో కమలనాథుల విజయం.. తర్వాత రాజస్థాన్ శాసనసభ, లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో 'హస్తం పార్టీ' కూడా కుల సమీకరణాలకు అనుగుణంగా సరైన అభ్యర్థులను బరిలోకి దించగల సామర్థ్యం కలిగి ఉన్నదని మరోసారి రుజువైంది. ఉప ఎన్నికల ఫలితాల ప్రకారం రాజస్థాన్ సీఎం వసుంధర రాజె సింధియా బీజేపీకి ఇప్పటి వరకు ప్రధాన ఆధారమే గానీ, భారంగా పరిణమించిందా? లేదా? అన్న విషయం ఇంకా తేలలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాజస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం కూడా కలవర పడుతోంది. తొలిసారిగా సీఎం వసుంధరా రాజె సింధియా పనితీరు వ్యవహార శైలి గురించి ఢిల్లీలోని బీజేపీ అధి నాయకత్వం అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం.

2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అజ్మీర్, అల్వార్ స్థానాల్లో తాజాగా రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కమలనాథులకు ఇబ్బందికరంగా మారింది. మండల్ గఢ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జాతీయస్థాయిలో బీజేపీకి ప్రధాన ముప్పుగా భావిస్తున్నారు. ఇటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. సీట్లు, ఓట్ల శాతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పెంచేసుకున్నది.

రాజస్థాన్ అసెంబ్లీ పోరు తర్వాత సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఇలా

రాజస్థాన్ అసెంబ్లీ పోరు తర్వాత సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఇలా

2013లో రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ 200 అసెంబ్లీ స్థానాలకు 163 స్థానాల్లో గెలుపొందింది. 1993 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి అధికార పార్టీ మారుతున్నది. 1993 నుంచి 2013 వరకు కాంగ్రెస్, బీజేపీలు చెరోసారి విజయం సాధించాయి. ఐదేళ్ల తర్వాత జరిగే ప్రతి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ పడతాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు నెలల తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

 160 స్థానాలకు 149 స్థానాల్లో గెలుపు అనుమానమే

160 స్థానాలకు 149 స్థానాల్లో గెలుపు అనుమానమే

2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్ లోని 25 స్థానాలనూ బీజేపీ గెలుచుకున్నది. రాజస్థాన్ రాష్ట్రంతోపాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 160 లోక్‌సభ స్థానాలకు 149 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన 282 స్థానాలను గెలుచుకోవాలన్నా, అంతకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్నా.. ఈ నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన సీట్లన్నీ బీజేపీ గెలుచుకోవాల్సిందే. కానీ వాస్తవంగా ప్రచారంలో ఉన్న అంశమేమిటంటే ఈ 160 స్థానాల్లోని 149 స్థానాల్లో మళ్లీ గెలుపొందడం కష్ట సాధ్యం అన్న అభిప్రాయం ఉన్నది.

రాజె సింధియాకు వ్యక్తిగత పరాజయం ఇలా

రాజె సింధియాకు వ్యక్తిగత పరాజయం ఇలా

అయితే రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపు.. రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసిన ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం కష్ట సాధ్యమని అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఉప ఎన్నికలు రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌కు వ్యక్తిగత విజయమైతే.. సీఎం వసుంధరా రాజె సింధియాకు ఓటమి వంటిది. ఇరువురు నేతలు తమ పార్టీల అభ్యర్థుల తరఫున పోటాపోటీగా ప్రచారం చేశారు.

 2014లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన రాజె శక్తిమంతురాలే

2014లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన రాజె శక్తిమంతురాలే

కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నా.. దీర్ఘ కాలంగా ప్రధాని నరేంద్రమోదీతో రాజస్థాన్ సీఎం వసుంధర రాజె సింధియాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ కొందరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేతలు మాత్రం ఆమె పేరు చెబితేనే భగ్గుమని మండి పడుతున్నారని సమాచారం. 2014 ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో అనుసరించిన వ్యూహం కారణంగా రాజస్థాన్ కమలనాథుల్లో ఇప్పటికీ వసుంధర రాజె సింధియా శక్తిమంతమైన నాయకురాలంటే అతి శయోక్తి కాదు.

 పద్మావత్‌పై సరిగ్గా స్పందించలేదని నిరసన

పద్మావత్‌పై సరిగ్గా స్పందించలేదని నిరసన

పాలనా తీరులో సీఎం వసుంధరా రాజె సింధియా ఆధిపత్య ధోరణే పార్టీ ఓటమి పాలవ్వడానికి కారణమవుతున్నదని బీజేపీ నేతలే చెప్తున్నారు. ఆమె అహంకార పూరిత వైఖరికి గుణపాఠం నేర్పాలని రాజపుత్రులు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నిర్మించిన ‘పద్మావత్' సినిమాపై నిషేధం విధించేందుకు సీఎం వసుంధరా రాజె సింధియా చేయాల్సిదంతా చేయలేదని రాజపుత్రుల ఆరోపణల్లో ప్రధాన ఆరోపణ.

 ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీ ఓటమి ఇలా

ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీ ఓటమి ఇలా

ఇక కాంగ్రెస్ పార్టీ మంచి నేతలను అభ్యర్థులుగా నిలపడంతోపాటు ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత కలగలిసి బీజేపీ అభ్యర్థుల ఓటమికి దారి తీసిందని చెబుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొటాబోటీ మెజారిటీకి ఆ రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభమే కారణమన్న విమర్శ ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం కారణమని ఇప్పటికిప్పుడు చెప్పకపోయినా ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో రాజస్థాన్‌తోపాటు మధ్యప్రదేశ్ రైతులు తమ అసంత్రుప్తిని బయట పెడతారని అంచనా వేస్తున్నారు. రైతుల్లో అసమ్మతిని తగ్గించేందుకు ఈ నెల ఒకటో తేదీన బడ్జెట్ ప్రతిపాదనల్లో ముఖ్యమైన పంటలపై 50 శాతం కనీస మద్దతు ధర వచ్చేలా చేస్తామని ప్రతిపాదించారు విత్త మంత్రి అరుణ్ జైట్లీ.

 ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక హెచ్చరిక వంటివే

ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక హెచ్చరిక వంటివే

అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజె సింధియా సారథ్యంలో బీజేపీ ముందుకు వెళితే సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తున్నది. కాదూ కూడదంటే ఆమె పార్టీని చీలుస్తారా? అన్న సందేహం కమలనాథులను వెంటాడుతున్నది. ఏది ఏమైనా బీజేపీ జాతీయ, రాజస్థాన్ రాష్ట్ర స్థాయి నాయకత్వానికి మాత్రం ఉప ఎన్నికల ఫలితాలు హెచ్చరిక వంటివేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఉప ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన వెంటనే పరిస్థితులను అంచనా వేసేందుకు శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన వసుంధరా రాజె సింధియా భవిష్యత్ పై అంచనాకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు.

 గెహ్లాట్, పైలట్, జితేంద్రలపై కాంగ్రెస్ హై కమాండ్‌దే తుది నిర్ణయం

గెహ్లాట్, పైలట్, జితేంద్రలపై కాంగ్రెస్ హై కమాండ్‌దే తుది నిర్ణయం

మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సచిన్ పైలట్‌కు ఈ ఉప ఎన్నికల ఫలితాలు తాత్కాలికంగా ఘన విజయమే. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్‌లతో పోలిస్తే ఒక మెట్టుపై ఉన్న సచిన్ పైలట్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. వీరు ముగ్గురు సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న వారే. అయితే ఈ నాయక త్రయానికి కాంగ్రెస్ పార్టీ ఎలా నచ్చ చెబుతున్నదీ మున్ముందు వేచి చూడాల్సిందే మరి.

 హిందుత్వ నినాదానికి ఇలా దూరంగా..

హిందుత్వ నినాదానికి ఇలా దూరంగా..

గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా సరైన అభ్యర్థుల ఎంపిక, కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని రాజకీయాలు చేయగల సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని రాజస్థాన్ అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ హిందుత్వ కార్డు వాడకుండా జాగ్రత్త పడింది. ఆవులను కొనుకెళ్తున్న ఇతర రాష్ట్రాల వ్యాపారులపై గోరక్షణ పేరిట దాడులు జరిగిందీ అల్వార్ లోనే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయక తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి.

 బీజేపీ, రాజె సంయుక్త వ్యూహం లేకుంటే ఇంతే

బీజేపీ, రాజె సంయుక్త వ్యూహం లేకుంటే ఇంతే

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది, తొమ్మిది నెలల సమయం ఉన్నది. ఈ నేపథ్యంలో వసుంధర రాజె సింధియా, కేంద్రంలోని బీజేపీ హై కమాండ్ పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వసుంధరా రాజె సింధియా రాజస్థానీల మనస్సు చూరగొనేందుకు రాజకీయ వ్యూహం అమలు చేయకుంటే పార్టీలోనే ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోవడమే కాదు తన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

 కర్ణాటక, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కీలకం

కర్ణాటక, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కీలకం

పార్టీలో బలమైన నేత అయినా.. మహిళా ఓటర్లే కీలకమైనా.. 2013లో మాదిరిగా ఈసారి వసుంధరా రాజె సింధియా ఘన విజయం సాధించడం అంత తేలికేం కాదు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నాయకత్వం ద్రుష్టి సారించింది. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే.. రాజస్థాన్ లోనూ అదే జరుగుతుందన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా అదే జరిగితే 2019లో సార్వత్రిక ఎన్నికల పోరుకు కాంగ్రెస్ పార్టీ విశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయన్న సంగతి గతేడాది ప్రారంభంలో ఏ ఒక్కరూ ఊహించలేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న గొప్పతనమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
It is said of the Bharatiya Janata Party in Rajasthan that chief minister Vasundhara Raje is its biggest asset, yet its biggest liability. The party’s mandarins in Delhi have always been worried about Rajasthan, and are uncomfortable about her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X