వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్ధాన్ లో వేగంగా పరిణామాలు- ఎల్లుండి కేబినెట్ విస్తరణ, ఆ లోపే బలపరీక్ష ?

|
Google Oneindia TeluguNews

రాజస్ధాన్ లో అసంతృప్త యువనేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో మారిన రాజకీయ పరిణామాలను సాధ్యమైనంత త్వరగా తమ చేతుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. మధ్యప్రదేశ్ తరహాలో పరిస్ధితులు చేజారే అవకాశాలు ఉన్నందున డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి సచిన్ పైలట్ ను తప్పించిన కాంగ్రెస్.. ఇప్పుడు బలపరీక్షతో పాటు కేబినెట్ విస్తరణను తెరపైకి తెచ్చింది. దీంతో పైలట్ తో పాటు బీజేపీ కూడా డిఫెన్స్ లో పడినట్లయింది. అటు ఇవాళ, రేపట్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు పైలట్ సిద్దమవుతున్నారు.

ఎంపీ-రాజస్థాన్: కాంగ్రెస్ పార్టీలో ప్రతిభకి చోటులేదు: జ్యోతిరాదిత్య సింధియాతో సచిన్ పైలట్ భేటీ! ఎంపీ-రాజస్థాన్: కాంగ్రెస్ పార్టీలో ప్రతిభకి చోటులేదు: జ్యోతిరాదిత్య సింధియాతో సచిన్ పైలట్ భేటీ!

ఎడారి టీ కప్పులో తుఫాను...

ఎడారి టీ కప్పులో తుఫాను...

ఎడారి రాష్ట్రమైన రాజస్ధాన్ లో ఎండల కంటే వేడి పుట్టిస్తున్న రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పలేని పరిస్ధితి ఉంది. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి తప్పడం లేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవులిచ్చినప్పటికీ సీఎం అశోక్ గెహ్లాట్ పై కోపంతో తిరుగుబాటుకు సిద్ధమైన సచిన్ పైలట్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకే కాంగ్రెస్ మొగ్గు చూపుతోంది. ఇప్పటికే పైలట్ ను డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం స్పష్టమైన సంకేతాలే పంపుతోంది.

త్వరలో బలపరీక్ష, కేబినెట్ విస్తరణ..

త్వరలో బలపరీక్ష, కేబినెట్ విస్తరణ..

గతంలో మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో సకాలంలో స్పందించకుండా ప్రభుత్వాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం రాబోయే సంక్షోభాన్ని ఊహించినట్లే కనిపిస్తోంది. దీంతో సచిన్ పైలట్ విషయంలో ముందుగా ఏమీ స్పందించకుండా మౌనంగా ఉన్నట్లుండి.. ఆయన చేతలను బట్టి వేటు వేసేసింది. తద్వారా మిగతా నేతలకు కూడా ఓ సంకేతం పంపింది. అదే సమయంలో ప్రభుత్వాన్ని తిరిగి సుస్ధిరంగా మార్చేందుకు వీలుగా బలపరీక్షతో పాటు కేబినెట్ విస్తరణను తెరపైకి తెస్తోంది. రేపు, ఎల్లుండిలో బలపరీక్ష, కేబినెట్ విస్తరణ చేపడతామనే సంకేతాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. బీజేపీతో పాటు సచిన్ పైలట్ కూ పంపుతోంది.

వేటుపై స్పందించిన పైలట్...

వేటుపై స్పందించిన పైలట్...

సీఎల్పీ సమావేశంలో సచిన్ పైలట్ తో పాటు ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు విశ్వేందర్ సింగ్, రమేష్ మీనాలను తొలగిస్తూ చేసిన తీర్మానాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకు అందించడం, ఆయన ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో వీరి స్ధానాల్లో కొత్త మంత్రుల ఎంపిక కోసం కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు గెహ్లాట్ గవర్నర్ కు తెలిపారు. మరోవైపు రాజస్ధాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముకేష్ భాకర్ ను కూడా కాంగ్రెస్ పార్టీ తొలగించింది. తాజా పరిణామాలపై స్పందించిన సచిన్ పైలట్ .. సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ ఓడించలేరు అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు సచిన్ పైలట్ స్ధానంలో పీసీసీ అధ్యక్షుడిగా గోవింద్ సింగ్ ను కాంగ్రెస్ నియమించింది.

ఎల్లుండి కేబినెట్ విస్తరణ...

ఎల్లుండి కేబినెట్ విస్తరణ...


రాజస్ధాన్ లో తాజా పరిణామాలపై వేగంగా స్పందిస్తున్న కాంగ్రెస్ .. ఎల్లుండి కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజ్ భవన్ లో విస్తరణ కార్యక్రమం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సుస్ధిరత కాపాడేందుకు పార్టీలోని సచిన్ పైలట్ వర్గానికి సీఎం గెహ్లాట్ మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. రేపు ఈ వ్యవహారం తేలే అవకాశముంది. ప్రభుత్వం పడిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశం అనంతరం సీఎం గెహ్లాట్ తెలిపారు.

English summary
rajasthan chief minister ashok gehlot plans for floor test in legislative assembly and cabinet expansion soon after sacking rebel leader sachin pilot from congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X