వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నేతకు తీవ్ర అవమానం, పాటిదార్ యూత్, మీకు అదే గతి పడుతుంది, నేలకు ముక్కు !

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడికి ఊహించని అవమానం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడి కారు నిర్లక్షంగా నడిపారని ఆరోపిస్తూ నలుగురు యువకులు ఆయన్ను మోకాళ్ల మీద నిలబెట్టి ముక్కును నేలకు రాయించి అవమానించారు. అయితే పెద్దలు జోక్యం చేసుకోవడంతో నలుగురు యువకులకు అదే శిక్ష విధించారు.

సచిన్ పైలెట్

సచిన్ పైలెట్

రాజస్టాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ బహిరంగ సభా సమావేశం సాగ్వార్ పట్టణంలో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, జిల్లా పంచాయితీ మాజీ సభ్యుడు భగవతి లాల్ సచిన్ పైలెట్ హాజరౌతున్న కార్యక్రమానికి వెళ్లడానికి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో జోసావా గ్రాయంలో వెలుతున్న సమయంలో భగవతి లాల్ కారు రోడ్డు పక్కన నీటి గుంతలో దిగింది.

నన్ను క్షమించండి

నన్ను క్షమించండి

కారు దూసుకుపోవడంతో నీటి గుంతలోని బురదనీరు సమీపంలో ఉన్న యువకుల మీదపడింది. భగవతి లాల్ కారు మాత్రం ముందుకు దూసుకెళ్లింది. మీద బురదనీరు పడటంతో యువకులు మరో వాహనంతో భగవతి లాల్ కారును వెంబడించి అడ్డగించారు. తాను కావాలని చెయ్యలేదని, కార్యక్రమానికి హాజరుకావాలని ఆత్రుతతో వెలుతున్న సమయంలో ఇలా జరిగిందని, క్షమించాలని భగవత్ లాల్ వేడుకున్నారు.

నేలకు ముక్కు రాయించారు

నేలకు ముక్కు రాయించారు

నలుగురు యువకులు మాత్రం భగవత్ లాల్ ను మోకాళ్ల మీద నిలబెట్టి ఆయన ముక్కును నేలకు రాయించి క్షమాపణలు చెప్పించుకున్న తరువాత వదిలిపెట్టారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరగడం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఈ వ్యవహారం ఆసల్యంగా వెలుగు చూసింది.

యువకులకు అదే గతి

యువకులకు అదే గతి

దుగన్ పూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ భగవతి లాల్ మీద దురుసుగా ప్రవర్తించిన యువకులకు అదే గతి పట్టిందని అన్నారు. యువకుల సామాజిక వర్గానికి చెందిన నాయకులతో వారిని మందలించామని అన్నారు.

బీజేపీ కార్యకర్తలు ?

బీజేపీ కార్యకర్తలు ?

భగవతి లాల్ ను ఎలా మోకాళ్ల మీద నిటబెట్టి ఆయన ముక్కును నేలకు రాయించి అవమానించారో అదే విధంగా యువకుల ముక్కులను నేలకు రాయించి క్షమాపణలు చెప్పించామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా బీజేపీకి మద్దతుగా ఉన్న కొందరు పాటీదార్లు ఇలా కాంగ్రెస్ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

English summary
Four men who had forced a Congress worker to rub his nose on the ground after his vehicle splashed mud on them were made to apologise after villagers intervened in the matter in Rajasthan's Dungarpur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X