• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాబోయే భార్య నుంచి లంచం తీసుకుంటూ..: ప్రీ వెడ్డింగ్ వీడియో షాక్(పిక్చర్స్)

|

జైపూర్: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. అందుకే ఆ వేడుకను ఎంతో సంబరంగా, అట్టహాసంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి కూడా తన వివాహంను ఓ మధుర జ్ఞాపకంలా మలచుకోవాలనుకున్నాడు. అయితే, అది కాస్తా బెడిసికొట్టడంతో ఉన్నతాధికారులకు సంజాయిషీ ఇచ్చుకోవాలన్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రీ వెడ్డింగ్ వీడియోలో కొత్తగా..

ప్రీ వెడ్డింగ్ వీడియోలో కొత్తగా..

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) ధన్‌పత్ సింగ్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ వీడియోను కొంచెం కొత్తగా తీయాలని ప్రయత్నించారు. పోలీస్ యూనిఫాంలోనే అతడు ఈ వీడియో షూటింగ్‌లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది.

పైసా పైసా అంటూ..

పైసా పైసా అంటూ..

ఈ వీడియోలో తనకు కాబోయే భార్య స్కూటీపై వస్తుండగా.. ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆమెను ఆపి ఎస్సై దగ్గరికి పంపిస్తాడు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ఫైన్ కట్టాలని ఎస్ఐ ధన్‌పత్ ఆమెకు చెబుతాడు. ఆమె సారీ చెబుతుండగా.. పైసా పైసా అంటూ ఎస్ఐ సంజ్ఞలు చేస్తాడు.

    తెలంగాణలో మహారాష్ట్ర SI రచ్చ.. తుపాకీతో హల్‌చల్.. చివరకు....!!??
    లంచం ఇచ్చి.. పర్సు కొట్టేసి..

    లంచం ఇచ్చి.. పర్సు కొట్టేసి..

    ఆ తర్వాత ఆమె ఎస్ఐ జేబులో డబ్బు పెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అయితే, ఆమె వెళుతూ అతని పర్స్ కొట్టేస్తుంది. దీంతో మరోసారి వీరిద్దరు కలుసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుందన్న రీతిలో ఈ వీడియోను తీశారు.

    పోలీస్ యూనిఫాంలో ఇలానా..?

    పోలీస్ యూనిఫాంలో ఇలానా..?

    అయితే, అంతా బాగానే ఉన్న ఈ వీడియోలో ధన్‌పత్ పోలీస్ యూనిఫాంలో లంచం తీసుకుంటుండటం ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూడా. దీంతో ఉన్నతాధికారులు సంజాయిషీ తీసుకుని, అతనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

    ఆ ఎస్ఐ ఏమన్నారంటే..

    ఆ ఎస్ఐ ఏమన్నారంటే..

    ఇది ఇలా ఉంటే, ఈ వీడియో కావాలని తీసింది కాదని.. తాను యూనిఫాంలో ఉన్న సన్నివేశాన్ని తీసేయాల్సిందిగా వీడియో గ్రాఫర్‌కు చెప్పానని ఎస్ఐ ధన్‌పత్ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే, సదరు వీడియో గ్రాఫర్ మాత్రం యూనిఫాంలో ఉన్నప్పుడు తీసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారని తెలిపారు.

    English summary
    A Rajasthan cop - caught on camera being bribed in uniform in a pre-wedding shoot - is in trouble after the video left his seniors upset.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X