వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓవరాక్షన్: మహిళలపై చేయి చేసుకున్న పోలీసులు
దౌసా: దైవ దర్శనం కోసం గుడికి వచ్చిన భక్తులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా వారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని దౌసా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే హోలీ సందర్భంగా జిల్లాలోని ప్రసిధ్ద పుణ్యక్షేత్రం మోహందీపూర్ ఆలయానికి వచ్చిన భక్తులపై పోలీసులు అమానవీయంగా ప్రవర్తించిన ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. మహిళల పట్ల నలుగురు పోలీసులు అనుచితంగా వ్యవహారించడమే కాకుండా వారిపై చేయి కూడా చేసుకున్నారు.

అందరూ చూస్తుండగానే మహిళా భక్తులపై చేయి చేసుకున్న పోలీసుల్ని అదేమని అడిగితే పురుషులపై దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు. దీంతో పోలీసుల దౌర్జన్యంపై భక్తులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై చేయి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.