చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో ఐసీఎస్ రిక్రూటర్ అరెస్టు: నగదు బదిలి, యువతకు గాలం, రాజస్థాన్, చెన్నైలో !

ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) కు నగదు బదిలి చేస్తున్నాడని, యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నాడని అనుమానంతో రాజస్థాన్ ఏటీఎస్, చెన్నై నగర పోలీసులు చెన్నై నగరంలో ఓ అనుమానిత ఉగ్రవాదిని,

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) కు నగదు బదిలి చేస్తున్నాడని, యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నాడని అనుమానంతో రాజస్థాన్ ఏటీఎస్, చెన్నై నగర పోలీసులు చెన్నై నగరంలో ఓ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు.

<strong>83 మందికి కుచ్చుటోపీ పెట్టిన లేడీ ఫ్యాషన్ డిజైనర్: కేరళ కుట్టి అరెస్టు, ఫేస్ బుక్ లో !</strong>83 మందికి కుచ్చుటోపీ పెట్టిన లేడీ ఫ్యాషన్ డిజైనర్: కేరళ కుట్టి అరెస్టు, ఫేస్ బుక్ లో !

చెన్నై నగరంలోని మన్నాడి ప్రాంతంలోని బర్మా బజార్ లో మొబైల్ షాప్ నిర్వహిస్తున్న హరూన్ (30) అనే అనుమానిత ఉగ్రవాదిని మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఇటీవల మైలాపూర్ లో మహమ్మద్ ఇక్బాల్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు.

 Rajasthan cops (ATS) arrest ISIS recruiter in Chennai city

మహమ్మద్ ఇక్బాల్ ఇచ్చిన సమాచారం మేరకు హరూన్ పేరు వెలుగులోకి వచ్చిందని రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు అంటున్నారు. హరూన్ మొబైల్ షాప్ ముసుగులో అనేక మంది దగ్గర నగదు వసూలు చేసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు పంపిస్తున్నాడని పోలీసులు అంటున్నారు.

<strong>తమిళనాడు రైతుల రుణాల రద్దు చెయ్యాలని హైకోర్టు ఆదేశం: స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు !</strong>తమిళనాడు రైతుల రుణాల రద్దు చెయ్యాలని హైకోర్టు ఆదేశం: స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు !

అంతే కాకుండా యువతను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేర్పించడానికి హరూన్ ప్రయత్నించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కర్ణాటకలోని భట్కల్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షఫీ అర్మార్ ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
The anti-terrorism squad of Rajasthan police has arrested a man at Mannadi in Chennai, on charges of collecting funds and recruiting militants to ISIS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X