వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్‌స్టార్ అనుచరులను.. షర్ట్, ప్యాంట్ విప్పేసి... ఒకరి వెనుక మరొకరు... వీధుల్లో....

|
Google Oneindia TeluguNews

గ్యాంగ్‌స్టార్లను తప్పించేందుకు అనుచరులు ఎంతటి సాహసానికైనా ఓకే అంటున్నారు. ఇదీ రీల్ లైఫ్ గురించి కాదు .. రియల్ లైఫ్‌లో జరుగుతున్న పరిణామాల గురించి. ఇటీవల హర్యానాలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తమ గ్యాంగ్‌స్టార్‌ను తప్పించేందుకు పోలీసుస్టేషన్‌పై కాల్పలు మోత మోగించారు. బుల్లెట్ శబ్ధంతో పీఎస్‌ మారుమోగింది.

అర్ధనగ్నంగా ..

అర్ధనగ్నంగా ..

హర్యానాలోని అల్వార్‌లో ఒకరి వెనుక మరొకరిని పోలీసులు తీసుకెళ్తున్నారు. అయితే వారి ఒంటిపై షర్ట్, ప్యాంట్ లేకపోవడంతో జనం ఏమైంది అని నోరెళ్లబెట్టారు. అలా వారిని అల్వార్ ప్రధాన వీధుల్లో గంట పాటు పోలీసులు తిప్పారు. ఎందుకు వారికి ఈ శిక్ష విధించామో అనే అంశంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తమ పీఎస్‌పై తుపాకీ గుళ్ల వర్షం కురింపించింది వీరేనని తెలిపారు.

గ్యాంగ్‌స్టార్‌ను తప్పించేందుకు ..

గ్యాంగ్‌స్టార్‌ను తప్పించేందుకు ..

ఈ నెల 6వ తేదీ.. హర్యానాలోని బెహరార్ పోలీసు స్టేషన్.. స్టేషన్‌లో కరడుగట్టిన గ్యాంగ్‌స్టార్ విక్రమ్ అలియాస్ పప్లా గుర్జార్ ఉన్నాడు. విషయం తెలుసుకొన్న అతని అనుచరులు అతడిని ఎలాగైనా తప్పించాలని అనుకొన్నారు. వెంటనే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించారు. పోలీసు స్టేషన్‌పై బుల్లెట్ల వర్షం కురిపించాలని భావించారు. అనుకున్నది తడవుగా తమ ప్రణాళికను అమలు చేశారు.

కాల్పుల మోత ..

కాల్పుల మోత ..

పోలీసు స్టేషన్‌ వద్దకు దాదాపు 20 మంది వచ్చారు. వాహనాలు దిగా కాల్పుల మోత మోగించారు. దీంతో తమను తాము కాపాడుకునేందుకు పోలీసులు తాపత్రాయపడ్డారు. అటునుంచి నేరుగా లాకప్ వద్దకెళ్లి విక్రమ్‌ను బయటకు తీసుకొచ్చారు. కొందరు కాల్పులు జరుపుతుండగా ..మరికొందరు విక్రమ్‌ను బయటకు తరలించారు.

13 మంది గుర్తింపు ..

13 మంది గుర్తింపు ..

ఈ కేసు విచారణను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు విచారణ స్వీడ్ పెంచారు. కాల్పులు జరిపిన వారిని గుర్తించారు. ఆదివారం వారిని పీఎస్ వద్దకు తీసుకొచ్చి .. అర్ధనగ్నంగా నిలబెట్టారు. తర్వాత అల్వార్ ప్రధాన వీధులగుండా తిప్పారు. వీరు ఓ సినిమా ఆధారంగా పోలీసు స్టేషన్‌పై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అయితే 15 నుంచి 20 మంది వరకు పీఎస్‌పై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు.

English summary
haryana police parade gangstar supporters, parade in alwar street, they helping on gangstar vikram flee, fire at police station,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X