వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటల్ రాజకీయం: రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్న హర్యానా పోలీసులు

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైన గుర్గావ్‌లోని ఓ హోటల్ వద్దకు చేరుకున్నారు రాజస్థాన్ పోలీసులు. అయితే, వారిని అడ్డుకున్నారు హర్యానా పోలీసులు. సుమారు గంటపాటు ఇక్కడ హైడ్రామా నడిచింది.

రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు రెండు ఆడియో టేపులు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఆడియో టేపుల వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మను ప్రశ్నించేందుకు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) బృందం ఇక్కడకు చేరుకుంది.

 Rajasthan Cops Visit Dissident Cong MLAs in Gurgaon Hotel, Haryana Police Stall Entry for Nearly one Hour

కాగా, ఈ ఆడియో టేపుల్లో ఉన్నది సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గొంతేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, కాంగ్రెస్ ఆరోపణలను కేంద్రమంత్రి షెకావత్ కొట్టిపారేశారు. ఆ గొంతు తనది కాదని అన్నారు. ఇలాంటి నకిలీ ఆడియో టేపులు తయారు చేయడంలో కాంగ్రెస్ దిట్ట అని, గెహ్లాట్ నివాసంలో ఇలాంటివి చాలానే ఉన్నాయన్నారు. ఎఫ్ఐఆర్‌లో గజేంద్ర సింగ్ అనే ప్రస్తావించిన పోలీసులు.. ఆయన మంత్రి అని ఎక్కడా పేర్కొనలేదు.

ఈ క్రమంలో రాజస్థాన్ ప్రత్యేక పోలీసుల బృందం మనేసర్ హోటల్ దగ్గరికి చేరుకుంది. ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మను ప్రశ్నించాలని కోరింది. అయితే, హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గంటపాటు వారిని లోపలికి అనుమతించలేదు. ఆ తర్వాత రాజస్థాన్ పోలీసులను హోటల్ లోపలికి అనుమతించారు. ఓ హోటల్‌లో సదరు ఎమ్మెల్యే లేరని సిబ్బంది చెప్పడంతో మనేసర్‌లోని మరో హోటల్‌కు వెళ్లారు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన లేకుంటే తమ రాష్ట్రానికి చెందిన తమ ఎమ్మెల్యేలకు ఎందుకు మద్దతు ఇస్తోందని ప్రశ్నించారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఇదే విధంగా స్పందించారు.

English summary
ARajasthan police team was on Friday evening stopped for some time by the Haryana police from entering a hotel in Gurgaon where some dissident Congress MLAs are said to be holed up, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X