బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rajasthan crisis: లాక్ డౌన్ లో సచిన్ టీమ్ కు కర్ణాటకలో ఏం పని ?, పవన్ ప్రశ్న, బీజేపీకి చాలెంజ్ !

|
Google Oneindia TeluguNews

జైపూర్/ బెంగళూరు: కరోనా వైరస్ కాలం, లాక్ డౌన్ టైమ్ లో రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజస్థాన్ లో అధికారంలో ఉన్న పోలీసుల మీద తమకు నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ తిరుబాటు నాయకుడు సచిన్ పైలెట్ బహిరంగంగా చెబుతూ హర్యానా పోలీసుల మీద ఎక్కువ నమ్మకం పెట్టారు. రాజస్థాన్ పోలీసుల మీద నమ్మకం లేని సచిన్ పైలెట్ వర్గం నాయకులు మేము కాంగ్రెస్ లోనే ఉన్నామంటూనే బీజేపీ అధికారంలో ఉన్న పోలీసుల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని, రాజస్థాన్ రెబల్ ఎమ్మెల్యేలను కర్ణాటకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

ఇప్పుడే తెలియాలి అంతే !

ఇప్పుడే తెలియాలి అంతే !

రాజస్థాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నామని మీడియాకు చెబుతున్నారు. సచిన్ పైలెట్, ఆయన వర్గం రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారికి రాజస్థాన్ లో అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం మీద, అక్కడి పోలీసుల మీద ఎందుకు నమ్మకం లేదని, హర్యానా పోలీసుల మీద ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారో మాకు ఇప్పుడే తెలియాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ అధికారంలో ఉందనే ధైర్యం

బీజేపీ అధికారంలో ఉందనే ధైర్యం

సచిన్ పైలెట్ వర్గం రాజస్థాన్ పోలీసుల మీద తమకు నమ్మకం లేదని, మా డిమాండ్లు తీరే వరకు మాకు హర్యానా పోలీసులు భద్రత కల్పించాలని అంటున్నారు. అయితే హర్యానాలో బీజేపీ అధికారంలో ఉందని, వీళ్లు (రెబల్ ఎమ్మెల్యేలు) బీజేపీలో చేరాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్లు బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపిస్తున్నారు.

 లాక్ డౌన్ లో కర్ణాటకలో ఏం పని ?

లాక్ డౌన్ లో కర్ణాటకలో ఏం పని ?

రాజస్థాన్ లోని బీజేపీలో చురకుగా ఉంటున్న కొందరు న్యాయవాదులు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఆ న్యాయవాదులను అడ్డం పెట్టుకుని రెబల్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని కోర్టులో వాదించడానికి సిద్దం అయ్యారని పవర్ ఖేరా ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేలు అందర్నీ హర్యానాలోని హోటల్ నుంచి కర్ణాటకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారని, లాక్ డౌన్ సమయంలో రెబల్ ఎమ్మెల్యేలకు కర్ణాటకలో ఏం పని ? అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు.

ఖూని చేస్తున్న బీజేపీ

ఖూని చేస్తున్న బీజేపీ

గత 10 రోజుల నుంచి బీజేపీ రాజస్థాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నిస్తొందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియా ముందు ఆరోపించారు. బీజేపీ నాయకులకు పరువు మర్యాద ఏమైనా ఉంటే హర్యానా పోలీసుల భద్రతతో హోటల్ లో తలదాచుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బయటకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీజేపీకి పవన్ ఖేరా సవాల్ విసిరారు. ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను అడ్డం పెట్టుకుని రెబల్ ఎమ్మెల్యేలను ఆ రాష్ట్రానికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారని పవన్ ఖేరా ఆరోపించారు.

Recommended Video

Audio Tapes కలకలం... Congress దూకుడు, రెబల్‌ ఎమ్మెల్యేల కు Show Cause Notices, BJP వ్యూహం ?
బీజేపీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు

బీజేపీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు

రాజస్థాన్ లోని 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ లోనే ఉన్నామని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే వారు బీజేపీకి ఎప్పుడో అమ్ముడు పోయారని రాజస్థాన్ సీనియర్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు శర్మ ఆరోపించారు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడతారనే భయంతోనే వాళ్లు (రెబల్ ఎమ్మెల్యేలు) కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని పైకి చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని రాజస్థాన్ మంత్రి రఘు శర్మ మండిపడుతున్నారు.

English summary
Rajasthan crisis: BJP trying to shift Rajasthan lawmakers to Karnataka: Says Congress Party tp leader Pawan Khera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X