సీఎంకు షాక్, 2007 స్టోరీ, ఎరువుల స్కామ్ లో ఈడీ దాడులు, ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాలు
న్యూఢిల్లీ/ జైపూర్/ ముంబై: సచిన్ పైలెట్ తిరుగుబాటుతో రాజస్థాన్ లోని తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్న ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లెట్ కుటుంబానికి ఈడీ అధికారులు గట్టిషాక్ ఇచ్చారు. 2007నాటి ఫర్టిలైజర్ కుంభకోణానికి సంబంధించిన కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ సోదరుడికి చెందిన కంపెనీల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. సీఎం సోదరుడికి సంబంధించిన ఈ కేసులో దేశవ్యాప్తంగా అనేక కంపెనీల్లో బుధవారం ఏకదాటిగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ దెబ్బతో రాజస్థాన్ సీఎం ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అసలే బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాల్లో ఉన్న సీఎంకు మరో తలనొప్పి ఎదురైయ్యింది.
Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

అసలే సినిమా కష్టాలు
రాజస్థాన్ లోని అశోక్ గెహ్లెట్ ప్రభుత్వం మీద సచిన్ పైలెట్, ఆయన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చెయ్యడంతో సీఎంకు సినిమా కష్టాలు ఎదురైనాయి. ఎలాగైనా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని అశోక్ గెహ్లెట్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సమస్యను కూడా సీఎం అశోక్ గెహ్లెట్ పట్టించుకునే తీరికలేకుండా ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు.

షాకిచ్చిన ఈడీ
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ సోదరుడు అగర్షియన్ మీద ఫర్టిలైజర్ స్కామ్ కేసు పెండింగ్ లో ఉంది. ఈ కేసు వ్యవహారంలో విచారణ చేస్తున్న ఈడీ అధికారులు బుధవారం ఒక్కసారిగా రాజస్థాన్ సీఎం కుటుంబ సభ్యులకు సినిమా చూపించారు. దేశవ్యాప్తంగా ఫర్టిలైజర్ స్కామ్ కేసులో సోదాలు ముమ్మరం చేశారు.

2007 స్కామ్ స్టోరీ
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ సోదరుడు అగర్షియన్ గెహ్లెట్ కు ఓ ఎరువుల కంపెనీ ఉంది. రైతులకు సబ్సిడీ ధరకు ఇచ్చే ఎరువులను అగర్షియన్ గెహ్లెట్ పలు ఎరువుల కంపెనీలకు విక్రయించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. 2007- 2009 మధ్య కాలంలో ఈ ఫర్టిలైజర్ స్కామ్ జరిగిందని అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

నిషేధిస్తే....విదేశాలకు ఎగుమతి చేస్తారా !
సబ్సిడీ ఎరువులను ఎంఓపీ ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అధికారిక దిగుమతిదారు. ఈ సంస్థ రైతులకు సబ్సిడి ధరలకు ఎరువులు సరఫరా చేస్తోందని, కానీ అలా జరగలేదని ఈడీ అధికారులు అంటున్నారు. విదేశాలకు ఎగుమతులను నిషేధించిన ఎరువులను అగర్షియన్ గెహ్లెట్ కు చెందిన అనుపమ్ కృషి సంస్థ మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి చేసిందని ఆరోపణలు ఉన్నాయి. 2012-13 మద్యకాలంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ఎరువుల స్కామ్ ను బయటకు తీశారు.

మాకు సంబంధం లేదు ?
కొందరు దళారీలు రైతుల దగ్గర ఎరువులు కొనుగోలు చేసి వాటిని విదేశాలకు ఎగుమతి చేశారని, ఈ స్కామ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని ఇంతకాలం అగర్షియల్ గెహ్లెట్ చెబుతూ వచ్చారు. అయితే రాజస్థాన్ రాజకీయ సంక్షోభం సమయంలో మళ్లీ తెర మీదకు ఎరువుల స్కామ్ కేసు రావడంతో కాంగ్రెస్ లీడర్స్ హడలిపోతున్నారు.