వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముచ్చటగా మూడోసారి CMకు 70 MM సినిమా, వైరస్ తో ముడిపెట్టిన గవర్నర్, దేవుడా.... కుర్చీ ఉంటుందా!

|
Google Oneindia TeluguNews

జైపూర్/ న్యూఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. రాజస్థాన్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లెట్ ముచ్చటగా మూడోసారి గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకు ఫైల్ పంపించారు. అయితే కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ఆగస్టు 15వ తేదీ ఆర్బాటంగా నిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు చెక్ పెడుతూ సీఎం అశోక్ గహ్లెట్ కు ఓ సందేశం పంపించారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సందర్బంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు సింపుల్ గా నిర్వహించుకోవాలని సీఎం అశోక్ గహ్లెట్ కు గవర్నర్ నుంచి సమాచారం అందడంతో సీఎం వర్గీయులు షాక్ కు గురైనారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లెట్ కు కలలో కూడా గవర్నర్ కల్ రాజ్ మిశ్రా కలలో కూడా 70 MM సినిమా చూపిస్తున్నారని తాజాగా వెలుగు చూసింది.

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో!Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో!

గవర్నర్ ఆవేదన

గవర్నర్ ఆవేదన

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో ఇప్పటికే 15 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. రాజస్థాన్ లో రానురాను కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎంకు వినడానికి ఇష్టం లేకపోయినా!

సీఎంకు వినడానికి ఇష్టం లేకపోయినా!

రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా స్వతంత్రదినోత్సవ వేడుకలు సింపుల్ గా నిర్వహించాలని చేసిన సలహాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లెట్ కు వినడానికి ఇష్టం లేకపోయినా తప్పడం లేదు. కరోనా వైరస్ ను వీలైనంత వరకు అరికట్టడానికి ప్రతిఒక్కరు ప్రయత్నించాలని, అందులో భాగంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు సింపుల్ గా నిర్వహించుకోవాలని సీఎం అశోక్ గహ్లెట్ కు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా సూచించారని సమాచారం.

మార్చి 13వ తేదీ అసెంబ్లీ సమావేశాలు!

మార్చి 13వ తేదీ అసెంబ్లీ సమావేశాలు!

రాజస్థాన్ లో మార్చి 13వ తేదీన అసెంబ్లీ సమావేశాలను అర్దాంతరంగా నిలిపివేశారు. మార్చి 13వ తేదీన రాజస్థాన్ లో కరోనా పాజిటివ్ కేసులు కేవలం రెండు మాత్రమే ఉన్నాయని, అయితే ఈ రోజు రాజస్థాన్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయో గుర్తు చేసుకోవాలని గవర్నర్ కల్ రాజ్ మిశ్రా రాజస్థాన్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు.

జాగ్రతగా ఉండాలి ఫ్రెండ్స్

జాగ్రతగా ఉండాలి ఫ్రెండ్స్

జులై 1వ తేదీన 3, 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటికే 10, 000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయని గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి ప్రయత్నించాలని అశోక్ గహ్లెట్ ప్రభుత్వానికి గర్నవర్ కల్ రాజ్ మిశ్రా సూచించారు.

Recommended Video

CM KCR To Meet Governor Tamilisai Soundararajan
 సీఎంకు 70 MM సినిమా

సీఎంకు 70 MM సినిమా

కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నాయకుడు సచిన్ పైలెట్ దెబ్బకు అసెంబ్లీలో బలప్రదర్శన నిరూపించుకుని సీఎం కుర్చీని కాపాడుకోవాలని అశోక్ గహ్లెట్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వాలని మూడోసారి సీఎం అశోక్ గహ్లెట్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకు లేఖ పంపించారు. సీఎం మూడోలేఖ వచ్చిన మరుసటి రోజు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా అసెంబ్లీ సమావేశాలకు, స్వతంత్ర దినోత్సవ వేడుకలకు, కరోనా వైరస్ కు లింక్ పెడుతూ ఓ లేఖ విడుదల చెయ్యడంతో సీఎం అశోక్ గహ్లెట్ వర్గీయులకు 70 MM సినిమా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Coronavirus: Rajasthan Governor Kalraj Mishra, in a statement today cancelling the annual Independence Day "at-home" event over what he called a spurt in coronavirus cases, delivered a message that Chief Minister Ashok Gehlot will not like to hear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X