• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌కు సచిన్ గుడ్ బై.. ముహుర్తం.. గెహ్లాట్ బలం 104.. బీజేపీ రివర్స్ గేర్..పైలట్ క్రాష్ ల్యాండ్

|

కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అద్భుతంగా ఫలించిన ఆపరేషన్ కమల్.. రాజస్థాన్ లో మాత్రం అత్యంత దారుణంగా విఫలమైంది. అశోక్ గెహ్లాట్ సర్కారును నిలువునా కూల్చేందుకు సాగిన నాటకం బట్టబయలు కావడంతో కిక్కరుమనకుండా ఉండిపోయింది. ఆరు నెలల కిందటే కుట్రను పసిగట్టిన గెహ్లాట్.. అత్యంత పకగడ్బందీగా, వ్యూహాత్మకంగా పన్నిన వలలో.. చివరికి కాంగ్రెస్ లాయలిస్టులే చిక్కుకోవడం గమనార్హం. సర్కారు కూల్చివేతకు బీజేపీతో కలిసి కుట్రలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్ పైలట్.. తనకున్న ఒకే ఒక్క దారినే ఎంచుకోనున్నారు. మరోవైపు సీఎం గెహ్లాట్ తన బలాన్ని గవర్నర్ ముందుంచారు..

6 నెలలుగా సచిన్ కుట్రలు.. ఆటోపైలట్ మోడ్‌లో రాజస్థాన్.. 16న కేబినెట్ రీ-షఫుల్.. సీఎం సంచలనాలు..

పార్టీకి గుడ్ బై.. ఇదే టైమ్..

పార్టీకి గుడ్ బై.. ఇదే టైమ్..

‘‘26ఏళ్లకే ఎంపీ టికెట్.. 30ఏళ్లకే కేంద్ర మంత్రిగా ప్రమోషన్.. 34 వయసులోనే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు.. 40 ఏళ్లకే డిప్యూటీ సీఎం పోస్టు. ఒక రాజకీయ నాయకుడికి పార్టీ ఎంతగా సహకరించిందో చెప్పడానికి ఇంతకన్నా రుజువులు కావాలా?''అన్న కాంగ్రెస్ హైకమాండ్ వ్యాఖ్యలకు ఎదురుసమాధానం చెప్పాలనే డిసైడ్ అయ్యారు సచిన్ పైలట్. కొద్ది రోజులుగా అనేక మలుపులు తిరుగతోన్న రాజస్థాన్ సంక్షోభం... చివరికి ఆయన నిష్క్రమణతో ముగియనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 10 గంటలకు మీడియాతో మాట్లాడనున్న పైలట్.. కాంగ్రెస్ ను వీడబోతున్నట్లు అధికారిక ప్రకటన చేస్తారని ‘ఎన్డీటీవీ' విశ్వసనీయంగా తెలిపింది.

విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్

బకరా అయ్యారా? బాంబులేస్తారా

బకరా అయ్యారా? బాంబులేస్తారా

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు కూలిపోయిన తర్వాత.. నెక్ట్స్ టార్గెట్ రాజస్థానే అని కమలనాథులు బాహాటంగానే ప్రకటించడం, ఆ మేరకు సీఎం గెహ్లాట్ జాగ్రత్త వహించడంతో కుట్రను నిలువరించగలిగారని, బీజేపీ చేతిలో సచిన్ బకరా అయ్యారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బీజేపీ కుట్రలో సచిన్ పావుల మారాడాని, మధ్య ప్రదేశ్ లో ఆపరేషన్ నిర్వహించిన బృందమే ఇక్కడా కార్యకలాపాలు నిర్వహించిందని, ఆరు నెలల అబ్జర్వేషన్ తర్వాతే సచిన్ కు నోటీసులు పంపామని గెహ్లాట్ చెప్పారు. అయితే, బుధవారం నాటి ప్రెస్ మీట్ లో సచిన్ దీనిపై ఎలా స్పందిస్తారు? సీఎం, ఇతర నేతలపై కొత్తరకం విమర్శల బాంబులు కురిపిస్తారా? అనే ది వేచి చూడాలి. మొత్తం వివాదంలో సచిన్ పదవులను తొలగించడమే తప్ప అతనిపై వేటు దిశగా కాంగ్రెస్ ఎలాంటి సంకేతాలు ఇవ్వనప్పటికీ, ఇంత జరిగాక పార్టీలో ఇమడలేని స్థితిలో గుడ్ బై చెప్పడమొక్కటే దారని సచిన్ కూడా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

గెహ్లాట్ @ 104

గెహ్లాట్ @ 104

గత ఎన్నికల ఫలితాల ప్రకారం.. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ 107 సీట్లతో అధికారం దక్కించుకోగా, టీబీపీ(2), సీపీఎం(2), ఇండిపెండెంట్లు(2), ఆర్ఎల్డీ(1) గెహ్లాట్ కు మద్దతుగా నిలిచాయి. బీజేపీకి 72, ఆర్ఎల్పీ 1, మరో ఇండిపెండెంట్ ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తత సంక్షోభంలో సచిన్ పైలట్ వెంట 30 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని ప్రచారం జరిగినా, ఆ సంఖ్య క్రమంగా 16కు మళ్లీ 10కి పడిపోతూ వచ్చింది. సచిన్ ఎపిసొడ్ తర్వాత బల నిరూపణపై సవాళ్లు రావడంతో సీఎం గెహ్లాట్.. తనకు మద్దతిస్తోన్న 104 మంది ఎమ్మెల్యేల జాబితా, వారి సంతకాలను గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకు అప్పగించారు. మరి అసెంబ్లీ ఫోర్ లోనూ బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశిస్తారా లేదా అనేది వెల్లడికాలేదు. సీఎం ప్రకటించినమేరకు 104 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారంటే.. సచిన్ వర్గం సంఖ్య సింగిల్ డిజిట్ లోనే ఉండొచ్చని తెలుస్తోంది.

  Rajasthan Political Crisis : వేడెక్కిన రాజస్తాన్ రాజకీయం..పూర్తి మద్దతు Ashok Gehlotకే ..!
  హైస్పీడ్ నిర్ణయాలు..

  హైస్పీడ్ నిర్ణయాలు..

  సచిన్ పైలట్ ఎపిసొడ్ తర్వాత రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఒక్కసారిగా స్పీడు పెంచారు. మంగళవారం రాత్రి తన నివాసంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 16న(గురువారం) కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు చేశారు. మొత్తం 8 మంత్రి పదవులు భర్తీ కానుండటంతో అందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు ఇదే అవకాశంగా భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పన తర్వాత సచిన్ ఎటు వెళతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. అయితే, మహారాష్ట్రలో అజిత్ పవార్ ఎపిసోడ్ మాదిరిగా.. రాజస్థాన్ లో బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ కావాలనే సచిన్ తో గేమ్ ఆడించి ఉంటుదనేవాళ్లూ లేకపోలేరు. బుధవారం నాటి సచిన్ ప్రెస్ మీట్ తో ఈ అంకానికి దాదాపు తెరపడే అవకాశముంది.

  English summary
  The Congress and Mr Pilot have clearly run out of road. All that remains now is for him to make it official by stating that he is exiting the Congress. He will hold a press conference at 10 am wednesday. CM Ashok Gehlot gives list of 104 MLAs to Governor,
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more