వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబినెట్ మంత్రులు సహా 100 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ షాక్, నో టిక్కెట్

|
Google Oneindia TeluguNews

జైపూర్: త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో మొదటి మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ వరుసగా మూడుసార్లు గెలిచినప్పటికీ, వరుసగా ఉండే సాధారణ ప్రజా వ్యతిరేకత మాత్రమే ఉంది. ముఖ్యమంత్రులు రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు.

<strong>సర్వేలో ఆసక్తికరం: బీజేపీ వద్దు, ప్రధానిగా మోడీయే కావాలి, రాహుల్ పోటీయే కాదు</strong>సర్వేలో ఆసక్తికరం: బీజేపీ వద్దు, ప్రధానిగా మోడీయే కావాలి, రాహుల్ పోటీయే కాదు

కానీ వరుసగా మూడుసార్లు పాలించిన కారణంగా ప్రజా వ్యతిరేకత సహజం. ఈ రెండు రాష్టాలకు భిన్నంగా రాజస్థాన్‌లో ఉంది. వసుంధరా రాజే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌తో హోరాహోరీ ఉండనుంది. కానీ రాజస్థాన్ మాత్రం కాంగ్రెస్ వశం కావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత

మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత

బీజేపీ పైన వ్యతిరేకత కంటే వసుంధర ప్రభుత్వంపై ఆగ్రహమే జనాల్లో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు 100 స్థానాల్లో కొత్త వారిని దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వసుంధరతో పాటు ఆమె కేబినెట్లోని పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ కారణంగా 200 నియోజకవర్గాల్లో సగం స్థానాల్లో కొత్త వారికి చోటు కల్పించనున్నారు.

నో టిక్కెట్, ఆరుగురు మంత్రులకు బీజేపీ షాక్

నో టిక్కెట్, ఆరుగురు మంత్రులకు బీజేపీ షాక్

హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ మినిస్టర్ సురేంద్ర గోయల్, పబ్లక్ వర్క్స్ డిపార్టుమెంట్ మినిస్టర్ యునస్ ఖాన్, దేవస్థాన్ మంత్రి రాజ్ కుమారి రిన్వా సహా పలువురు మంత్రులపై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆరుగురు మంత్రులపై వేటు పడనుందని తెలుస్తోంది.

కాంగ్రెస్ పరిస్థితీ అంతే

కాంగ్రెస్ పరిస్థితీ అంతే

రాజస్థాన్‌లో తాజా మాజీ ఎమ్మెల్యేలకు లేదా గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన వారికి రాజస్థానీలు ఎక్కువగా షాకిస్తుంటారు. 2003లో గెలిచిన 68 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ 2008లో టిక్కెట్లు ఇచ్చింది. కానీ అందులో 28 మంది మాత్రమే గెలిచారు. 40 మంది ఓడిపోయారు. 2013లోను కాంగ్రెస్ పరిస్థితి అదే. 2008లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 105 మందికి ఆ పార్టీ 2013లో టిక్కెట్ ఇచ్చింది. కానీ 14 సీట్లలో మాత్రమే గెలిచింది.

Recommended Video

ఓటరు జాబితాలో మీ పేరు మిస్ అయితే ఏం చేయాలో తెలుసా?

English summary
The BJP may field fresh faces in at least half the seats in the upcoming assembly election in Rajasthan in an attempt to overcome the anti-incumbency that the ruling party is facing according to the feedback programmes it has held across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X