వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెహ్లట్ సర్కార్ సాహసం ..స్కాలర్‌షిప్ టెస్ట్, పాఠ్యాంశాల్లో దీన్‌దయాల్ పేరు తొలగింపు, మండిపడ్డ బీజేపీ

|
Google Oneindia TeluguNews

జైపూర్ : రాజస్థాన్‌లో అశోక్ గెహ్లట్ ప్రభుత్వాన్ని అస్థిరపరుచాలని బీజేపీ భావిస్తుంటే .. అందుకు ధీటుగానే స్పందిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇదివరకు వసుంధర రాజే పెట్టిన పథకాల పేర్లను క్రమంగా మారుస్తోంది. తాజాగా విద్యార్థుల స్కాలర్‌షిప్ పరీక్షకు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరును తొలగించి తేనేతుట్టెనే లేపినట్టైంది. దీనిపై బీజేపీ నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.

స్కాలర్‌షిప్ టెస్ట్‌ పేరు తొలగింపు ..
గత బీజేపీ సర్కార్ విద్యార్థుల ప్రతిభ వెలికితీసేందుకు స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహించింది. దీనికి ఆరెస్సెస్ నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పేరును పెట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా పథకాల పేర్లను మారుస్తోంది. పనిలో పనిగా స్కాలర్ షిప్ టెస్ట్ పేరును మారుస్తున్నట్టు ప్రకటించింది. ఇదివరకటి ప్రభుత్వం అకారణంగా స్కాలర్ షిప్ టెస్ట్‌కు దీన్‌దయాళ్ పేరు పెట్టిందని గుర్తుచేసింది. అందుకే ప్రోత్సహక పరీక్షకు పేరు మార్చినట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గెహ్లట్ సర్కార్ చేసిన పని సాహసమని చెప్పాల్సి ఉంటుంది. లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయంతో మంచి ఊపుమీదున్న బీజేపీ .. అధికారానికి కాస్త అటు ఇటుగా ఉన్ప ప్రభుత్వాలను డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో గెహ్లట్ ధైర్యం చేసి .. బీజేపీ సిద్దాంతకర్త పేరు మార్చే సాహసం చేసింది.

Rajasthan govt drops Deendayal Upadhyays name from school test, BJP says Congress is scared

ఇదీ సరికాదు ...
రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఉన్న దీన్ దయాల్ పేరును తొలగించడంలో అంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, దీన్ దయాళ్‌ను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాదు దీన్‌దయాల్ జివిత చరిత్ర గురించి ఉన్న పాఠ్యాంశాలను కూడా తొలగించి తమ కపటబుద్దిని బయటపెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇదివరకు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బీజేపీ కాషాయమయం చేసింది ..

ఇప్పుడు దానిని తిరిగి ఆధునీకరిస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. మాజీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్‌నని గెహ్లట్ సర్కార్ చర్యలను తప్పుపట్టడంతో ఈ వివాదం రాజుకుంది. ఆరెస్సెస్ భావజాలాన్ని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసి .. విస్మరిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించిన పలు పథకాలను .. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొనాసాచిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన కుటీల బుద్ధి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఆరెస్సెస్ భావజాలం, స్కూల్ పాఠ్యాంశంలో ఆరెస్సెస్ గురించిన ప్రస్తావన తీసేయడాన్ని తప్పుపట్టారు.

English summary
The Ashok Gehlot government in Rajasthan has dropped the name of RSS ideologue Deendayal Upadhyay's name from a school scholarship test. This has left the BJP fuming in the state. The party has said Congress is scared of Deendayal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X