• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో అంజలి.. 18 పెళ్లిళ్లతో తెలుగు యువతి సంచలనం -శోభనం కాగానే నగలు, డబ్బుతో పరార్

|

'నమస్తే అండీ, ఊరికి కొత్త, ఈ వీధిలోనే ఉంటున్నాం, కాస్త ఈ వివరాలు చెబుతారా..' అంటూ సంవాదం మొదలుపెడతారు. క్రమంగా పరిచయం పెరిగేకొద్దీ తమది పొద్దికైన సంప్రదాయ కుటుంబమని అవతలివాళ్లను నమ్మిస్తారు. ఆ తర్వాత కొంతకాలానికే.. 'మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఈ ఊర్లోనో, మీకు తెలిసినవాళ్లలోనో మంచి అబ్బాయి ఉంటే చూసిపెట్టండి..' అంటూ అసలు వ్యవహారానికి తెరతీస్తారు. అప్పుడుగానీ అందంగా ముస్తాబై తెరమీదికొస్తుంది భాగ్‌వతి అలియాస్ అంజలి. కొన్ని సార్లు అధికారికంగా, చాలాసార్లు రహస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటూ, తాళి కట్టిన వరుణ్ని, వాడి కుటుంబాన్ని సాంతం లూటీ చేయడమే అంజలి అంగ్ గ్యాంగ్ పని.

ఆన్‌లైన్ క్లాసుల తర్వాత పోర్న్ వీక్షణ -ఉద్రేకంలో అత్యాచారాలు -డీజీపీ సంచలన వ్యాఖ్యలుఆన్‌లైన్ క్లాసుల తర్వాత పోర్న్ వీక్షణ -ఉద్రేకంలో అత్యాచారాలు -డీజీపీ సంచలన వ్యాఖ్యలు

18 పెళ్లిళ్ల అంజలి..

18 పెళ్లిళ్ల అంజలి..

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది యువకులను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత నగలు, నగదుతో ఉడాయించిన భాగ్‌వతి అలియాస్‌ అంజలి అనే యువతిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్టుచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందినట్లు భావిస్తున్న ఆ యువతితో పాటు.. మరో ఐదుగురినీ జునాగఢ్‌లో పట్టుకున్నారు. భరత్ మెహతా, అరుణా మెహతా దంపతుల బంధువైన వైశాలి మెహతా అనే యువతి పెళ్లి పేరుతో మోసం చేసిందంటూ జునాగఢ్ కు చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటికొచ్చింది. బాధితుడు ఇచ్చిన ఫొటోల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. అదొక ఫేక్ పెళ్లిళ్ల ముఠా అని తేల్చారు.

పెళ్లి, శోభనం పూర్తయిన వెంటనే..

పెళ్లి, శోభనం పూర్తయిన వెంటనే..

జనాగఢ్ టౌన్ లోనే వారాల వ్యవధిలోనే ఇద్దరు యువకులను పెళ్లి పేరుతో మోసం చేసింది అంజలి గ్యాంగ్. ముందుగా ఓ ఊరిని ఎంంచుకుని, కొంతకాలం అక్కడే మకాం వేసి, రకరకాల పేర్లతో పరిచయాలు పెంచుకోవడం, బంధువుల అమ్మయంటూ అంజలిని ముందుపెట్టి పెళ్లి సంబంధం నాటకాలు అడటం, పెళ్లి, శోభనం తంతు పూర్తయిన కొద్ది రోజులకే అర్జెంట్ అవసరమంటూ డబ్బులు, నగలు పోగేసుకుని గ్యాంగ్ మొత్తం అక్కడి నుంచి చెక్కేయడం వీరి స్టైల్. ప్రతిసారి మారుపేరు, నకిలీ పత్రాలతో చెలామణి అవుతుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

జగన్‌కు కేంద్రం భారీ షాక్ -పోలవరం తాజా అంచనాలకు ఆర్థిక శాఖ నో -అదే ప్రాజెక్టు వద్ద కొత్త లిఫ్ట్ ఇరిగేషన్‌జగన్‌కు కేంద్రం భారీ షాక్ -పోలవరం తాజా అంచనాలకు ఆర్థిక శాఖ నో -అదే ప్రాజెక్టు వద్ద కొత్త లిఫ్ట్ ఇరిగేషన్‌

మూడు రాష్ట్రాల్లో కలాపాలు..

మూడు రాష్ట్రాల్లో కలాపాలు..

జునాగఢ్‌ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడి, ఇలాగే నగలతో పాటు రూ.3 లక్షల మేర నగదుతో ఆమె పారిపోయింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అంజలి ముఠా మోసమంతా వెలుగులోకి వచ్చింది. నిందితులు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రాంతంలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అంజలి, ఆమె తల్లి ధనుబెన్‌లను పోలీసులు అరెస్టుచేసి విచారించగా 18 మంది యువకులు వీరి చేతిలో మోసపోయినట్లు తెలిసింది. మొత్తం మూడు రాష్ట్రాల్లో వీరు దోపిడీ కాలపాలు సాగించినట్లు పోలీసులు చెప్పారు. గుజరాత్‌, మద్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈ ముఠా పలువురిని మోసగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

English summary
Rajasthan police have arrested Bhagwati alias Anjali for cheating 18 men in context of marriage and then stealing jewellery and cash. Along with anjali woman who is believed to belong to Telugu states, five others were caught in Junagadh. Police say the gang has deceived many in Gujarat, Madhya Pradesh and Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X