• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లవ్ జిహాద్: ‘‘నా కుటుంబాన్ని నాశనం చేస్తానన్నాడు.. అందుకని నేనే చంపేశా.. తప్పా?’’

By Ramesh Babu
|

జైపూర్‌ : రాజస్థాన్‌లో దారుణ హత్యకు పాల్పడిన శంభులాల్‌ రాయ్‌ఘర్‌ ఎట్టకేలకు నోరు మెదిపాడు. లవ్‌ జిహాద్‌ నుంచి యువతిని కాపాడేందుకే తాను అతన్ని చంపానని చెప్పాడు. అంతేకాదు, తాను చేసింది నేరమే కాదని అతను వాదిస్తున్నాడు.

రాజ్‌సమంద్‌ జిల్లాలోని రాజ్‌నగర్‌ ప్రాంతంలో దేవి హెరిటేజ్‌ రోడ్డు సమీపంలో లవ్ జిహాద్‌కు పాల్పడితే ఇలాగే జరుగుతుందంటూ.. మహమ్మద్ అఫ్రాజుల్((అంతకు ముందు అతని పేరును మహ్మద్‌ భట్టా షేక్‌ అని పోలీసులు పేర్కొన్నారు) అనే కూలీని శంభులాల్‌ రాయ్‌ఘర్‌ కొట్టిచంపి ఆపైన సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.

భయానక వీడియో! వ్యక్తిని చితక్కొట్టి.. సజీవ దహనం! 'లవ్ జిహాద్'కు సమాధానమా?

సంచలనం సృష్టించిన ఈ కేసులో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి గురువారమే అదుపులోనికి తీసుకున్నారు. పోలీసు విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి.

 నా కుటుంబాన్ని నాశనం చేస్తానన్నాడు, అందుకే...

నా కుటుంబాన్ని నాశనం చేస్తానన్నాడు, అందుకే...

తమ కాలనీకి చెందిన ఓ యువతితో మహమ్మద్ అఫ్రాజుల్‌ పారిపోయాడని, చిన్నతనం నుంచి ఆమె తనకు తెలుసునని నిందితుడు శంభులాల్ రాయ్‌ఘర్ పేర్కొన్నాడు. ఆమె సోదరుడితో తాను కలిసి చదువుకున్నానని, అఫ్రాజుల్ వలలో చిక్కుకున్న ఆమెను వెనక్కి రప్పించేందుకు సహకరించబోయానని తెలిపాడు. ఈ విషయంలో అఫ్రజుల్‌ తనకే వార్నింగ్ ఇచ్చాడని, తన కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించడని పేర్కొన్నాడు. అందుకే అతన్ని చంపేశానని, ఆ వీడియోను తీసింది కూడా తన అల్లుడే అని, తాను చేసింది తప్పు కాదని తాను భావిస్తున్నానని దిల్వారా పోలీస్‌ స్టేషన్‌ లో శంభులాల్‌ వివరించాడు.

వీడియోలో నా తండ్రి ఆక్రందనలు విన్నాను...

వీడియోలో నా తండ్రి ఆక్రందనలు విన్నాను...

మరోవైపు ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్రగా స్పందిస్తున్నారు. నిందితుడిని కూడా అదే విధంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మృతుడు అఫ్రాజుల్ తల్లి మాట్లాడుతూ.. దీని వెనుక ఏ కారణముందో తనకు తెలియదని, ఘటన జరిగిన రోజు ఉదయం కూడా తాను తన కుమారుడితో మాట్లాడానని చెప్పారు. మృతుడి కుమార్తె రెజీనా ఖటూన్ మాట్లాడుతూ.. శంభులాల్ రోజూ తమకు ఫోన్ చేసి బెదిరించేవాడని తెలిపారు. మంగళవారం కూడా తాము అతడితో మాట్లాడామని చెప్పారు. అసలు ఈ లవ్ జిహాద్ అంటే ఏమిటో కూడా తమకు తెలియదని వాపోయారు. తమ తండ్రిని సజీవ దహనం చేయడానికి ముందు జంతువును కొట్టినట్లు కొట్టారని, తాను ఆ వీడియోను చూశానని, తన తండ్రి ఆక్రందనలు విన్నానంటూ కన్నీరుమున్నీరయింది రెజీనా.

 దీని వెనక పెద్ద తలకాయలున్నాయి...

దీని వెనక పెద్ద తలకాయలున్నాయి...

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా అంటూ జరిగిన ఈ ఘటన చిన్నది కాదని, ఇదో పెద్ద కుట్ర అని, దీని వెనక పెద్ద తలకాయల హస్తముందని, పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని మృతుడు అఫ్రాజుల్ మేనకోడలు జీనత్ ఖాన్ పేర్కొంది. ప్రస్తుతం తమ బంధువులు న్యాయం కోరుతూ పోలీస్‌స్టేషన్ వద్దనే ఉన్నారని వివరించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు శుంభునాథ్‌ రాయ్‌ఘర్‌ చెప్పిన విషయాలనే కాకుండా.. దర్యాప్తు పక్కగా, మరింత లోతుగా చేపడతామని, పూర్తి సాక్ష్యాలు సేకరించి అసలు వాస్తవాలను త్వరలోనే వెల్లడిస్తామని ఉదయ్‌పూర్‌ ఐజీ ఆనంద్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా ట్వీట్ చేశారు.

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పుస్తకం, కరపత్రం...

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పుస్తకం, కరపత్రం...

మరోవైపు నవంబర్ 19న జైపూర్‌లో జరిగిన ఓ హిందూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఓ స్టాల్‌లో ఈ లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఓ వివాదాస్పద పుస్తకంతో పాటు ఒక కరపత్రాన్ని కూడా హాజరైన హిందూ అమ్మాయిలకు పంచి పెట్టారని పోలీసులకు సమాచారం అందింది. ఆ కరపత్రంలో ఓ బాలీవుడ్ నటి ఫొటోతోపాటు లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఓ హెచ్చరిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే ఇద్దరు ముస్లిం నటులు తమ హిందూ భార్యలను వదిలేశారని కూడా ఆ కరపత్రంలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు విచారణకు అదేశించారు.

English summary
The family of a Muslim labourer who was burnt alive in Rajasthan for alleged "love jihad" demanded the death penalty for the accused and claimed that there was a conspiracy. The victim Mohammed Afrazul's family is reportedly in disbelief, saying, "Those who killed him like an animal and showed his pictures to the world should be hanged."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X