వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ చాట్,న్యూడ్ ఫోటోలతో పాకిస్తాన్ హనీ ట్రాప్... ఇండియన్ ఆర్మీ సమాచారం లీక్.. రాజస్తాన్ వ్యక్తి అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి లీక్ చేశాడన్న ఆరోపణలతో రాజస్తాన్‌లోని జైసల్మీర్‌కి చెందిన ఓ వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొద్ది నెలలుగా సోషల్ మీడియా ద్వారా ఇండియన్ ఆర్మీ సమాచారాన్ని అతను పాకిస్తాన్‌‌కు షేర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూడు రోజుల క్రితం అతన్ని అరెస్ట్ చేసి విచారించగా... 'హనీ ట్రాప్' వ్యవహారం వెలుగుచూసింది. పలువురు మహిళలు నగ్న ఫోటోలు ఎరవేసి అతని నుంచి ఆర్మీ సమాచారాన్ని రాబట్టినట్లు అధికారులు నిర్దారించారు.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

రాజస్తాన్‌లోని జైసల్మీర్ జిల్లా లతీ గ్రామానికి చెందిన సత్యనారాయణ పలివాల్(42) అనే వ్యక్తిని మూడు రోజుల క్రితం పోక్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద అతనిపై గూఢచర్యం అభియోగం నమోదైంది. రెండు రోజుల పాటు అధికారులు అతన్ని విచారించగా... మిలటరీ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్‌కు లీక్ చేసినట్లు అంగీకరించాడు.

ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఏం చెబుతోంది...

ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఏం చెబుతోంది...

ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఉమేష్ మిశ్రా ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు. లతీ గ్రామానికి సత్యనారాయణ భార్య సర్పంచ్‌గా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా ఏదైనా గ్రామంలో మిలటరీ కార్యకలాపాలు చేపడితే స్థానిక గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలా అతని భార్య ద్వారా మిలటరీ కార్యకలాపాల గురించి సత్యనారాయణకు తెలిసేది. సత్యనారాయణ బలహీనతను తెలుసుకున్న పాకిస్తాన్ ఐఎస్ఐ అతన్ని హనీ ట్రాప్ చేసింది.

హనీ ట్రాప్‌తో...

హనీ ట్రాప్‌తో...

మొదట పాకిస్తాన్ ఐఎస్ఐకి చెందిన ఓ మహిళా ఏజెంట్ సత్యనారాయణ పలివాల్‌తో కాంటాక్ట్‌లోకి వచ్చింది. తాను ఇండియన్ జర్నలిస్టునని పరిచయం చేసుకుంది. సత్యనారాయణతో రెగ్యులర్‌గా చాట్ చేయడం,వీడియో కాల్స్ చేయడం చేసేది. ఈ క్రమంలో అతనికి నగ్న ఫోటోలు,సెక్స్ చాట్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించింది. అప్పటినుంచి పలువురు మహిళల నగ్న ఫోటోలు అతనికి పంపించడం,సెక్స్ చాట్ చేయడం ద్వారా అతన్ని మానసికంగా లోబర్చుకుంది. ఇక సత్యనారాయణ తాను చెప్పినట్లు వింటాడన్న నమ్మకం కుదిరాక పోక్రాన్‌లో ఆర్మీ కదలికలకు సంబంధించి అతని నుంచి వివరాలు రాబట్టడం మొదలుపెట్టింది.

ఇంటలిజెన్స్ నిఘాతో పట్టుబడ్డ సత్యనారాయణ..

ఇంటలిజెన్స్ నిఘాతో పట్టుబడ్డ సత్యనారాయణ..

అలాగే జైసల్మీర్‌ సరిహద్దు వద్ద ఆర్మీకి సంబంధించిన కదలికలపై కూడా సత్యనారాయణ ఆమెకు కీలక సమాచారం లీక్ చేశాడు. సత్యనారాయణ వ్యవహారం తమ దృష్టికి రావడంతో ఇంటలిజెన్స్ అధికారులు గత నెల రోజులుగా అతని సోషల్ మీడియా ఖాతా,ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. అతను గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించడంతో మూడు రోజుల క్రితం అతన్ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో సత్యనారాయణ నేరం అంగీకరించగా... అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

English summary
The CID (special branch) on Sunday arrested the husband of a former sarpanch from Jaisalmer district who was honey-trapped by a Pakistani ISI agent and leaked sensitive information about the Indian army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X