వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెహ్రూపై అభ్యంతకర వీడియో: నటి, టాప్ మోడల్ అరెస్ట్: స్వేచ్ఛగా మాట్లాడలేమా? అంటూ.. !

|
Google Oneindia TeluguNews

జైపూర్: బాలీవుడ్ నటి, టాప్ మోడల్ పాయల్ రోహత్గీ అరెస్టు అయ్యారు. రాజస్థాన్ లోని బుంది పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నెహ్రూ కుటుంబంపై అభ్యంతకరంగా ఓ వీడియోను రూపొందించడమే దీనికి కారణం. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలను కించపరిచేలా పాయల్ రోహత్గీ ఈ వీడియోను రూపొందించారని, కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.

జవహర్ లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై రూపొందించిన ఓ అభ్యంతరకమైన వీడియోను పాయల్ రోహత్గీ సెప్టెంబర్ 1వ తేదీన తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలపై ఆమెపై ఫిర్యాదు చేశారు. తాజాగా రాజస్థాన్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఛార్మేష్ శర్మ మరోసారి పాయల్ రోహత్గీపై బుంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Rajasthan: Model and actress Payal Rohatgi detained by police in Bundi

తమ దర్యాప్తులో భాగంగా ఆదివారం ఉదయం రాజస్థాన్ కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు ముంబై వెళ్లి, పాయల్ ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మమతా గుప్తా తెలిపారు. ముంబైకి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు పాయల్ రోహత్గీని అరెస్టు చేశారని వెల్లడించారు. ఇదే విషయాన్ని పాయల్ కూడా నిర్ధారించారు. తనను బుంది పోలీసులు అరెస్టు చేశారని, వాక్ స్వాతంత్య్రాన్ని హరించి వేశారని అన్నారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఓ జోక్ గా మారిందని ఆమె ట్విట్టర్ లొో రాశారు.

English summary
Model and actress Payal Rohatgi detained by Bundi police, allegedly for her comment on former Prime Minister Pandit Jawaharlal Nehru. SP Mamta Gupta says, "Payal Rohatgi has been detained. Case registered." Earlier, a notice was served to Rohtagi for allegedly posting the objectionable video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X