వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిను వీడని నీడను మేమే... రాహుల్ ఇంటికి క్యూ కడుతున్న పార్టీ సీనియర్లు

|
Google Oneindia TeluguNews

రాహుల్ గాంధీ రాజీనామా పర్యం ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ అధ్యక్షపదవి నుండి తనను తప్పించాలని రాహుల్ గాంధీ కొరిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నేతలు రాహుల్ ఇంటికి క్యూలు కడుతున్నారు. రాహుల్ నాయకత్వమే మాకు శిరోధార్యం అంటూ మోకరిల్లుతున్నారు.

రాహుల్ ఇంటికి క్యూ కడుతున్న పార్టీ సీనియర్ నేతలు

రాహుల్ ఇంటికి క్యూ కడుతున్న పార్టీ సీనియర్ నేతలు

పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో నైతిక భాద్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి ఇతరులకు ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో పార్టీ పెద్దలు ఆయనకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ లేనిదే తమకు భవిష్యత్ లేదంటూ పలువురు ఆయనతో చర్చలు చేపట్టారు. అయినా రాహుల్ గాంధీ మాత్రం పార్టీ తన నిర్ణయించులేక పోతున్నారు.

నేడు షీలా దీక్షీత్‌తో పాటు పలువురు నేతలు రాహుల్ తో సమావేశం

నేడు షీలా దీక్షీత్‌తో పాటు పలువురు నేతలు రాహుల్ తో సమావేశం

తాజాగా నేడు సాయంత్రం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శీలాదీక్షిత్ రాహుల్ ఇంటికి బాటపట్టారు. ఆమేపాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఆమే వెంట ఉన్నారు. రాహుల్‌తో సమావేశం అయిన అనంతరం శీలా దీక్షీత్ మీడీయాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ నాయకత్వం పార్టీకి అవసరమని ఆమే తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలోనే పార్టీ అధ్యక్షపదవికి రాజీనామ చేయవద్దని ఆమే రాహుల్‌ను కోరారు.

రాజస్థాన్ కాంగ్రెస్ తీర్మాణం

రాజస్థాన్ కాంగ్రెస్ తీర్మాణం

ఇక మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలంటూ ఓ తీర్మాణాన్ని పాస్ చేశారు. కాగా రాజస్థాన్ ముఖ్యమంత్రితోపాటు మరి కొందరిపై రాహుల్ గాంధీ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.. మొత్తం మీద రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని వివిధ రాష్ట్ర్ర్రాల పార్టీ నాయకత్వం సైతం ఆయన్ను కోరుతుంది. మరి రాహుల్ గాంధీ ఏలాంటీ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

English summary
With Rahul Gandhi remaining firm on his decision to step down as Congress president in the wake of a humiliating drubbing in the Lok Sabha elections, the party’s Rajasthan unit has passed a resolution urging him to stay put as the party chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X