సచిన్ సత్తా తెలుసా ? బిడ్డా ద్వారం తెరిచియే ఉన్నది, బీజేపీ బంపర్ ఆఫర్, సచిన్ స్వీట్ 16, సీఎం !
జైపూర్/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరినోట విన్నా దాదాపుగా కరోనా వైరస్ మాటే వినడపడుతోంది. అయితే రాజస్థాన్ ప్రజలకు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తగిలింది. కరోనా వైరస్ తో పాటు ఇప్పుడు ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో వనిపిస్తున్న పేరు సచిన్. అదే నండి సచిన్ పైలెట్. అప్పట్లో క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ పేరు ఎలా మారుమోగిపోయిందో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సచిన్ పైలెట్ పేరు అలాగే మారుమోగిపోతోంది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, పీసీసీ చీఫ్ పదవి నుంచి సచిన్ పైలెట్ ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన వెంటనే 'బిడ్డా మీకు ద్వారము తెరిచియే ఉన్నది'అంటూ రాజస్థాన్ బీజేపీ నాయకులు సచిన్ పైలెట్ కు మొదటిసారి బహిరంగంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు.
Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !

సచిన్ అంటే ఇష్టం లేదు
రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 70MM సినిమా చూపించిన సచిన్ పైలెట్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే చచ్చిన పాముతో పనిఏముంది అని సచిన్ పైలెట్ మాత్రం వారి బుడ్డబెదిరింపులకు ఏమాత్రం భయపడలేదు. ఇదే సమయంలో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పీసీసీ చీఫ్ పదవి నుంచి సచిన్ పైలెట్ ను తప్పించామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే సచిన్ పైలెట్ కాని, ఆయన వర్గీయులు కానీ ఏమాత్రం చీమకుట్టినట్లు కూడా లేకపోవడంతో వారు పట్టించుకోలేదు.

బిడ్డా ద్వారం తెరిచియే ఉన్నది
రాజస్థాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ తో పాటు ఆయన వర్గంలోని ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. సచిన్ పైలెట్ ను అన్ని పదవుల నుంచి తప్పించామని, ఆయనకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఇదే సమయంలో సచిన్ పైలెట్ తో పాటు ఆయన మద్దతుదారులకు బీజేపీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం మాథూర్ మొదటిసారి బహిరంగంగా ఆహ్వానం పలికారు.

సచిన్ కి ఆత్మాభిమానం ఎక్కువ
సచిన్ పైలెట్ తో పాటు ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ ఆత్మాభిమానం ఉన్నవారని, అందుకే కాంగ్రెస్ పార్టీ పెత్తనం వారు సహించలేకపోయారని, ప్రశ్నించిన పాపానికి వారి మీద బహిష్కరణ వేటు వేశారని బీజేపీ రాజస్థాన్ నాయకుడు ఓం మాథూర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత సచిన్ పైలెట్ కు సెంటిమెంట్ తో కొట్టారు. రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం ముదురుతున్న సమమంలో బీజేపీ నాయకులు మొదటి సారి బహిరంగంగా సచిన్ పైలెట్ కు మా పార్టీలోకి రావాలని బంపర్ ఆఫర్ ఇచ్చారు.

సీఎంకు సవాల్
తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పూర్తికాలం తాను అధికారంలో ఉంటానని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. మీకు మెజారిటీ ఎమ్మెల్మేల మద్దతు ఉందని మీ ఇంట్లో (కాంగ్రెస్ పార్టీలో) చెప్పుకుంటే కుదరదని, అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నిరూపించుకుని తరువాత చంకలు గుద్దుకోవాలని రాజస్థాన్ బీజేపీ నాయకుడు ఓం మాథూర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు సవాలు విసిరారు.

గోడ మీద దీపం పెట్టిన పైలెట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి సీటులో కుర్చోవాలని సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు చేశారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మీద తిరుబాటు చేసిన సచిన్ పైలెట్ తాను బీజేపీలో చేరడం లేదని పైకి చెబుతూనే ఉన్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ బీజేపీ నాయకులు సచిన్ పైలెట్ తో పాటు ఆయన వర్గీయులను మంగళవారం బహిరంగంగా బీజేపీలోకి ఆహ్వానించారు.

సచిన్ సత్తా వాళ్లుకు తెలుసా ?
సచిన్ సమర్థవంతమైన నాయకుడని, ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉపయోగించుకోలేవడం లేదని, అయితే ఇది వారి అంతర్గత వ్యవహారం అని బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద సచిన్ పైలెట్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన గంటలోనే బీజేపీ నాయకులు ఆయనకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయని బహిరంగంగా బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. తనకు 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతుంటో మంగళవారం సచిన్ పైలెట్ వర్గం విడుదల చేసిన వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం స్పష్టంగా వెలుగు చూసింది. మొత్తం మీద సచిన్ తన గ్రూప్ లోని 16 మంది రెబల్ ఎమ్మెల్యేలతో రాజస్థాన్ సీఎంకు స్వీట్ తినిపిస్తున్నారు. సచిన్ పైలెట్ దెబ్బకు రాజస్థాన్ కోటలు గడగడ కదలిపోతున్నాయి.