వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబోయ్ ఏమి ఎండలురా బాబూ: అక్కడ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్‌లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వరుసగా ఐదవ రోజు ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. రాజస్థాన్‌లోని చురూ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 50.8 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి. ఇక రాజస్థాన్‌లో ఇతర నగరాల్లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా లేవు. అక్కడ కూడా 49 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక బికనేర్‌లో 47.9 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయ్యాయి. ఇక వరుసగా ఐదురోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో పశ్చిమ భారతానికి రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

జోద్‌పూర్‌లో 45.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా... బార్మర్ 44.5 డిగ్రీలు, జైపూర్ 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. దీంతో పాటు ఎడారి ప్రాంతం నుంచి విపరీతమైన వడగాలులు వీస్తుండటంతో సాధారణ ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు కొందరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 2016 మే 19న చురూ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆ సమయంలో 50 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఇక గత శనివారం అత్యధిక టెంపరేచర్ నమోదు అయ్యింది.

Rajasthan records highest temperatures ever, touches 50degree celsius

ఇక ఎండవేడిమిని తట్టుకునేందుకు ప్రజలు మూడు లీటర్లు నీరు క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక బయటి ఆహారం తీసుకోవడం ఆపేయాలని రికమెండ్ చేస్తున్నారు. ఇక చర్మంపై మంచి సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలని డాక్టర్లు తెలిపారు. ఇలా చేయడం వల్ల అల్ట్రా వాయిలెట్ సూర్యకిరణాల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. ఇదిలా ఉంటే ఐఎండీ రెడ్ కలర్ అలర్ట్‌ను జారీ చేసింది.వాతావరణ శాఖ నాలుగు కలర్స్‌ను ఎండ తీవ్రతను సూచించేందుకు ఉపయోగిస్తుంది. అవి గ్రీన్, ఎల్లో, రెడ్, అంబర్ కలర్.

English summary
Churu in Rajasthan, meanwhile, recorded the highest temperature in the country today at 50.8 degree Celsius. Other cities in Rajasthan were also in the running with Ganganagar recording a maximum temperature of 49 degrees Celsius, and Bikaner recording 47.9 degree Celsius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X