వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిళ్లు కావడం లేదని ఊరు పేర్లు మార్చేశారు!

|
Google Oneindia TeluguNews

జైపూర్: తమ గ్రామంలోని యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని, ఇందుకు తమ గ్రామం పేరే కారణమని భావించిన గ్రామస్తులు తమ ఊరి పేరును మార్చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఆ ఊర్లో అన్ని సౌకర్యాలున్నాయి.. యువకులు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నా.. చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మాయిల్ని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఆ ఊరి పేరు మియాంకా బరా అని ఉండటమే కారణమట.

మియాంకా బరా.. అనేది ముస్లిం ఊరిపేరు కావడం, దాని అర్థం ముస్లింల పరిష్కారం కావడంతో తమ కుమారులకు పెళ్లిళ్లు కావడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామం పేరును మార్చాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేశాక, తాజాగా అధికారులు ఊరి పేరును మార్చారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఊరికి మహేశ్ నగర్‌గా మార్పు చేశారు.

Rajasthans Miyan Ka Bara renamed as Mahesh Nagar

ఈ విషయమై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హర్మీర్ సింగ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి పూర్వం ఈ గ్రామాన్ని మహేశ్ నగర్ అనే పిలిచేవారనీ, కాలక్రమంలో కొన్ని కారణాలతో దీన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ఇది ఇలా ఉండగా మరో రెండు గ్రామాల పేర్లు కూడా మారిపోయాయి. ఝుంజును జిల్లాలోని ఇస్మాయిల్‌ఖర్డ్‌ను పిచన్వా ఖర్ద్‌గా మార్చగా, జాలోర్‌లోని నర్పడను నర్పురగా మార్చారు.

English summary
A village of about 1,500 people in Rajasthan's Barmer district has got a new identity. It was known as Miyan Ka Bara till now. It has been renamed as Mahesh Nagar now. Rechristening of Miyan Ka Bara as Mahesh Nagar happened after Union home ministry approved the state government's proposal for the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X