వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ ఇండియా వరల్డ్ -2019 విజేతగా రాజస్థాన్‌ ముద్దుగుమ్మ

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన అందాల భామ సుమన్ రావు విజేతగా నిలిచారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచారు సుమన్ రావు. ఇక చత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2019వ టైటిల్‌ను సాధించారు. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019 విజేతగా బీహార్‌కు చెందిన ముద్దుగుమ్మ శ్రేయా శంకర్ నిలిచారు.

Rajasthans Suman Rao wins Miss India World title 2019

కాలేజీ విద్యార్థిణి అయిన 20 ఏళ్ల సుమన్ రావు థాయ్‌లాండ్‌లో జరగబోయే మిస్ వరల్డ్ 2019 పోటీల్లో భారత్ నుంచి పాల్గొననుంది. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాన్ని సాధించేందుకు శరీరంలోని ప్రతి నరము. అణువు ఇష్టంతో కష్టపడుతుందని తద్వారా విజయం వరిస్తుందని షో తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ రావు చెప్పారు.

Rajasthans Suman Rao wins Miss India World title 2019

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రేమో డీసౌజా, ప్రముఖ నటి హ్యూమా ఖురేషీ, చింత్రాగధ సింగ్, ఫ్యాషన్ డిజైనర్ ఫాల్గుణి షేన్ పీకాక్, భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ చెత్రీలు వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్, విక్కీ కౌషల్, మౌనీ రాయ్‌లు తమ డ్యాన్స్ స్టెప్పులతో వీక్షకులను అలరించారు. కార్యక్రమంకు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, నటుడు మనీష్‌పాల్‌లు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

English summary
Suman Rao from Rajasthan has won the Femina Miss India World 2019 beauty pageant during a star-studded ceremony at Sardar Vallabhbhai Patel Indoor Stadium here. Shivani Jadhav from Chhattisgarh clinched Femina Miss Grand India 2019 title and Shreya Shanker from Bihar won Miss India United Continents 2019 title during the grand finale of the beauty pageant on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X