రూ. 35 కోట్లు బంపర్ ఆఫర్, నీతినిజాయితీకి మారుపేరు, అవునా ?, సినిమా చూపించిన సచిన్, లీగల్ నోటీసులు!
జైపూర్/ న్యూఢిల్లీ: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) రామాయణం జరుగుతుంటే రాజస్థాన్ లో మాత్రం రాజకీయ హైడ్రామా రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తనకు పార్టీ మారాలని తిరుగుబాటు నేత సచిన్ పైలెట్ రూ. 35 కోట్లు ఆఫర్ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ తల గిర్రున తరిగిపోయే విధంగా మా నాయకుడు సచిన్ పైలెట్ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారని సచిన్ వర్గీయులు స్పష్టం చేశారు. తాను నీతినిజాయితీకి మారుపేరు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న గిరిరాజ్ సింగ్ మలింగ ఇప్పుడు ఏం చేస్తారో మేమే చూస్తామని సచిన్ పైలెట్ వర్గీయులు అంటున్నారు.
Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

సచిన్ రూ. 35 కోట్ల బంపర్ ఆఫర్ ?
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ తన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, పీసీసీ చీఫ్ పదవిని సైతం వద్దనుకున్నారు. రాజస్థాన్ లోని అశోక్ గెహ్లెట్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి తనను పార్టీ మారాలని సచిన్ పైలెట్ చెప్పారని, అందుకు ప్రతిఫలంగా ఎంత డబ్బులు అయినా ఇస్తామని, ముందుగా తనకు రూ. 35 కోట్లు ఆఫర్ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

నీతినిజాయితీకి ఈ గిరిరాజ్ పెట్టిందే పేరు
రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం తనకు ఇష్టం లేదని, తాను నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నానని, అందుకే సచిన్ పైలెట్ రూ. 35 కోట్ల ఆఫర్ ను తిరస్కరించానని గిరిరాజ్ సింగ్ మలింగ అన్నారు. గత డిసెంబర్ నెల నుంచి రాజస్థాన్ లోని అశోక్ గెహ్లెట్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఓ వర్గం ప్రయత్నాలు చేస్తోందని సచిన్ పైలెట్ వర్గం మీద గిరిరాజ్ సింగ్ మలింగ ఆరోపణలు చేశారు.

గిరిరాజ్ తల గిర్రున తిరిగింది
తన పేరు ప్రతిష్టలు మరక అంటే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ తిరుబాటు నేత సచిన్ పైలెట్ ఆరోపించారు. తన మీద ఆరోపణలు చేసే ధైర్యం లేని కొందరు నేతలు గిరిరాజ్ సింగ్ మలింగను అడ్డం పెట్టుకుని తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సచిన్ పైలెట్ ఆరోపించారు. ఇదే సమయంలో తనకు రూ. 35 కోట్లు ఆఫర్ ఇచ్చారని ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్ మలింగకు సచిన్ పైలెట్ లీగల్ నోటీసులు పంపించారు. గిరిరాజ్ సింగ్ మలింగకు మా నాయకుడు సచిన్ పైలెట్ త్వరలో సినిమా చూపిస్తారని ఆయన వర్గీయులు అంటున్నారు.

మాతో పెట్టుకుంటే మటాష్
రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న సచిన్ పైలెట్, ఆయన వర్గంలోని 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు చేశారు. ఇదే సమయంలో సచిన్ పైలెట్, ఆయన వర్గీయులపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేసింది. సచిన్ పైలెట్ వర్గం వివాదం రాజస్థాన్ హైకోర్టుకు చేరింది. ఇక బుధవారం ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇలాంటి సమయంలోనే సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి లీగల్ నోటీసులు పంపించారు.