వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు-అనుభవం: రజనీకాంత్‌కు అమితాబ్ బచ్చన్ సూచన

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదే సమయంలో ఆయనతో బీజేపీ చర్చలు జరుపుతోందనే ప్రచారం జరగడంపై ఆరెస్సెస్ సీనియర్ సిద్ధాంతకర్త గురుమూర్తి స్పందించారు. రజనీకాంత్‌తో బీజేపీ చర్చలు జరుపుతోందనేవి కేవలం ఊహాగానాలే అన్నారు. అవాస్తవ వార్తలన్నారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ ఓ వైపు జరుగుతుండగానే.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ రజనీకి ఓ సూచన చేసినట్లుగా కూడా చెబుతున్నారు. పార్టీ పెట్టి, క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలేవీ పెట్టుకోవద్దని రజనీకి సలహా ఇచ్చారని అంటున్నారు.

అమితాబ్ బచ్చన్‌కు రాజకీయాల పైన అవగాహన ఉంది. 1980ల్లో బిగ్ బీ అలహాబాద్‌ నియోజకవర్గం నుంచి లోకసభకు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. కానీ మూడేళ్లకే రాజీనామా చేసి ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు.

బీజేపీకి లబ్ధి చేకూర్చేలా..

బీజేపీకి లబ్ధి చేకూర్చేలా..

ఆంగ్ల మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి.. ఓ పార్టీ పెట్టాలని రజనీకాంత్‌కు సూచించారు. తమిళనాడులో బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా రజనీతో పార్టీ పెట్టించాలనే ప్లాన్ అందులో ఉందనే వాదనలు వినిపించాయి.

పరిణామాలు గమనిస్తున్న బీజేపీ

పరిణామాలు గమనిస్తున్న బీజేపీ

ప్రస్తుతం తమిళనాడులో, అన్నాడీఎంకేలో పరిణామాలను బీజేపీ గమనిస్తోంది. ప్రస్తుత తరుణంలో రజనీ పార్టీ పెడితే బాగా క్లిక్ అవుతారని కమలదళం భావిస్తోందని అంటున్నారు. అయితే, బీజేపీ మద్దతుతో ఆయన పార్టీ పెడతారనే ప్రచారం సాగింది. అంతేకాదు, రజనీ ముఖ్యమంత్రిగా బీజేపీ పావులు కదిపుతోందని అంటున్నారు.

కొట్టిపారేసిన గురుమూర్తి

కొట్టిపారేసిన గురుమూర్తి

అయితే, ఈ వార్తలను ఎస్ గురుమూర్తి కొట్టి పారేశారు. రజనీకాంత్ పార్టీ పెట్టాలని తాము సూచించినట్లుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. మరోవైపు, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటే ఎక్కువ మంది నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

జయ మృతి తర్వాత..

జయ మృతి తర్వాత..

జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత పోరు కనిపిస్తోంది. ఓ విధంగా తమిళనాట రాజకీయ శూన్యత ఉంది. దీనిని బీజేపీ సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు పదేపదే తెరపైకి వస్తోంది.

English summary
Amidst all the political turmoil in Tamil Nadu there is talk that superstar Rajinikanth is set to launch his own political outfit. However his Hum co-star, Amitabh Bachchan has advised him against it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X