వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనమే: తమిళనాట 23ఎంపీ సీట్లు రజినీ పార్టీకేనని తేల్చిన తాజా సర్వే

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన పార్టీ పేరు కూడా ప్రకటించకుండానే రాష్ట్రంలో ఇతర పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు తమిళ రాజకీయాలు ఆయన చుట్టే తిరుగుతుండటం గమనార్హం.

ఇప్పటికే పలు సర్వేలు రజినీకాంత్ తన పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే కింగ్ మేకర్ అవుతారని తేల్చాయి. అయితే, ఆయనపై విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వస్తున్న సర్వేలు రజినీకే అనుకూలంగా ఉండటం గమనార్హం. ఇటీవల ఇండియా టుడే సర్వే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీ మూడోస్థానంలో నిలుస్తారని పేర్కొన్న విషయం తెలిసిందే.

23స్థానాలతో కింగ్ మేకర్

23స్థానాలతో కింగ్ మేకర్

తాజాగా ప్రముఖ ఛానల్‌ రిపబ్లిక్‌ టీవీ, సీ ఓటర్‌ నిర్వహించిన సర్వేలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో రజినీకాంత్‌ పార్టీకి 23 స్థానాలు వస్తాయని, ఆయన రాష్ట్రంలో కింగ్‌మేకర్‌ అవుతారని తేలింది.

రజినీ! గుడ్ లీడర్: అక్షయ్, మద్దతుగా 234స్థానాల్లో విశాల్ ప్రచారం, రెహమాన్ సపోర్ట్ రజినీ! గుడ్ లీడర్: అక్షయ్, మద్దతుగా 234స్థానాల్లో విశాల్ ప్రచారం, రెహమాన్ సపోర్ట్

రజినీ సంచలనమే..

రజినీ సంచలనమే..

రజినీకాంత్ పార్టీ ప్రకటించి పోటీలో నిలిస్తే ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇస్తారని, దేశ రాజకీయాలపైనా ప్రభావం చూపుతారని పేర్కొంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 28.3 శాతం ఓట్లతో 14 స్థానాలు డీఎంకేకు, 13.6 శాతం ఓట్లతో 2 అన్నాడీఎంకేకు వస్తాయని ఆ సర్వే వెల్లడించింది.

రజినీ అద్భుతం, పట్టలేని ఆనందం, బాడీగార్డునే: లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు రజినీ అద్భుతం, పట్టలేని ఆనందం, బాడీగార్డునే: లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

జాతీయ పార్టీలు ఖాతాలు తెరవవు

జాతీయ పార్టీలు ఖాతాలు తెరవవు

ఇక కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు ఖాతా కూడా తెరవవని పేర్కొంది. 33.7 శాతం ఓట్లతో రజనీకాంత్‌ పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో రజినీకాంత్ ఎంట్రీ పెను సంచలనమనే చెప్పాలి.

జయ తర్వాత రజినీనే..

జయ తర్వాత రజినీనే..

జయలలిత తర్వాత అంతటి స్థాయి నేత ఇప్పుడు తమిళ రాజకీయాల్లో లేకపోవడంతో.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రజినీని తమిళ ప్రజలు ఆదరిస్తారని పలు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టే స్థాయిలో అసెంబ్లీ సీట్లు రాకపోయినా.. కీలకంగా మారతారని తెలుస్తోంది.

English summary
Tamil Super Star Rajinikanth will win 23 LS seats, says new survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X