వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: రజనీకాంత్ కొత్త స్కెచ్: సీఎం అభ్యర్థిగా‘మోనార్క్’:జయ, కరుణనే ఢీ కొట్టిన ఐఏఎస్ !

తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి సునామీ సృష్టించడానికి సిద్దం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆచీతూచి అడుగులు వేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి సునామీ సృష్టించడానికి సిద్దం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. తనను విమర్శిస్తున్న వారికి తగిన బుద్ది చెప్పడానికి సమయం కోసం వేచి చూస్తున్నారు. అందుకోసం సీఎం అభ్యర్థిగా కొత్త పేరును తెరమీదకు తీసుకురానున్నారు.

<strong>ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్: సూపర్ స్టార్ కు కోపం, మెడపట్టి గెంటేయండి !</strong>ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్: సూపర్ స్టార్ కు కోపం, మెడపట్టి గెంటేయండి !

తమిళనాడు ప్రజల కష్టాలు పట్టించుకోకుండా కొన్ని పార్టీలో చోద్యం చూస్తున్నాయని, అనేక మంది రాజకీయా నాయకులు అవినీతిలో కూరుకుపోయారని రజనీకాంత్ అభిమానులను ఉద్దేశించి ప్రసగించారు. తమిళనాడు రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారాలని అన్నారు. తమిళనాడు రాజకీయ వ్యవస్థనే మార్చగల సామార్థ్యం ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారికి రజనీకాంత్ గాలం వెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

సూపర్ స్టార్‘కొత్త పార్టీ'గ్యారెంటీ !

సూపర్ స్టార్‘కొత్త పార్టీ'గ్యారెంటీ !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు సైతం కొత్త పార్టీ పెట్టాలని రజనీకాంత్ కు సూచించారని తెలిసింది. ఏ పార్టీలో చేరకుండా కొత్త పార్టీ పెట్టి అన్ని పార్టీల్లోని సమర్థవంతమైన నాయకులను తన పార్టీలోకి ఆహ్వానించాలని రజనీకాంత్ కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది.

తమిళ బిడ్డకాదు, నీకు ఆ అర్హత లేదు !

తమిళ బిడ్డకాదు, నీకు ఆ అర్హత లేదు !

రజనీకాంత్ కర్ణాటకలో పుట్టి తమిళనాడుకు వలస వచ్చారని పలు పార్టీల నాయకులు, తమిళ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. తమిళనాడులో పుట్టకుండా పోరుగు రాష్ట్రంలో జన్మించిన రజనీకాంత్ తమిళ ప్రజలను పాలించడానికి ఎలా సిద్దం అవుతారు ? అని వారు బహింరంగా విమర్శించి ఆందోళనకు దిగుతున్నారు.

తెరమీదకు ఐఏఎస్ అధికారి !

తెరమీదకు ఐఏఎస్ అధికారి !

తమిళనాడుకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సగాయం పేరు చెబితే ఆ రాష్ట్రంలో తెలీని ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. సిన్సియర్ ఐఏఎస్ అధికారి, ఏ రాజకీయ పార్టీ నాయకులను లెక్క చెయ్యరు, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దంగా ఉంటారని ఐఏఎస్ అధికారి సగాయంకు మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆయన రజనీకాంత్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

కరుణానిధి ఫ్యామిలీకి సినిమా

కరుణానిధి ఫ్యామిలీకి సినిమా

2011లో సగాయం మధురై జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ఆ సందర్బంలో కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరికి చెందిన ఇంజనీరింగ్ కాలేజ్ అవసరాల కోసం రైతులకు సరఫరా చేస్తున్న నీటిని తన కాలేజ్ కు మళ్లించుకుంటున్నారని గుర్తించారు. ఆ సందర్బలో అళగిరి తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సగాయంను అడ్డుకోవాలని ప్రయత్నించారు. అయితే రైతుల జోలికి వస్తే పరిస్థితులు తీవ్రస్థాయిలో ఉంటాయని సగాయం హెచ్చరించి అళగిరి, ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేశారు.

జయలలితను ధిక్కరించి, కోర్టులో

జయలలితను ధిక్కరించి, కోర్టులో

మధురై జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి అదే జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న సగాయం అప్పట్లో ప్రయత్నించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సగాయంకు అడ్డుకట్టవేశారు. జయలలితనే దిక్కరించిన ఐఏఎస్ అధికారి సగాయం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టులో మనవి చేశారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో అక్రమ మైనింగ్ వ్యాపారులకు దడ పుట్టించారు.

అర్దరాత్రి కొండలు, పోలాల్లో మకాం

అర్దరాత్రి కొండలు, పోలాల్లో మకాం

మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి ఐఏఎస్ అధికారి సగాయం రాత్రిపూట కొండలు, పోలాల్లో మకాం వేశారు. మధురై జిల్లాలో అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాను పూర్తిగా అరికట్టారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకేలోని నాయకులకు సినిమా చూపించారు. ఆ ఒక్క దెబ్బతో తమిళనాడు యువత గుండెల్లో ఐఏఎస్ అధికారి సగాయం హీరో అయ్యారు.

రజనీకాంత్ నోట అదే మాట !

రజనీకాంత్ నోట అదే మాట !

తమిళనాడులో ప్రస్తుతం పారిపాలన అతలాకుతలం అయ్యిందని, ప్రజలను పరిపాలించడానికి సరైన నాయకుడు లేరని, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు అవసరం అని రజనీకంత్ ఇటీవల చెప్పారు. అలాంటి లక్షణాలు ఉన్న సిన్సియర్ ఐఏఎస్ అధికారి సగాయంను రజనీకాంత్ తన పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

సీఎం అభ్యర్థిగా సగాయం ?

సీఎం అభ్యర్థిగా సగాయం ?

రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టి, తమిళనాడు ప్రజలకు సేవ చెయ్యడానికి సిద్దం అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి సగాయంను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని సూపర్ స్టార్ సన్నిహితులు అంటున్నారు. ఎందుకంటే తాను తమిళుడు కాదు అంటున్న వారికి సమాధానం చెప్పడానికి అదే తమిళనాడులో పుట్టిన సిన్సియర్ ఐఏఎస్ అధికారిని సీఎం చేసి ప్రజలకు మంచి పరిపాలన అందివ్వాలని, ఆ అర్హత సగాయంకు ఉందని రజనీకాంత్ భావించారని సమాచారం.

జాతీయ రాజకీయాల్లోకి రజనీకాంత్ ?

జాతీయ రాజకీయాల్లోకి రజనీకాంత్ ?

తమిళనాడులో అధికారం సొంతం చేసుకుంటే సగాయంను సీఎం చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి రజనీకాంత్ సిద్దంగా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తమిళుడు అయిన వ్యక్తికే తాను ప్రధాన్యత ఇచ్చి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి తమిళనాడు ప్రజలతో పాటు దేశ ప్రజలకు సేవ చెయ్యాలని రజనీకాంత్ ఆలోచిస్తున్నారని తెలిసింది.

విమర్శలకు చెక్, అంతా సవ్యంగా !

విమర్శలకు చెక్, అంతా సవ్యంగా !

సినీ గ్లామర్ తో పాటు యువతలో మంచి పేరు ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సగాయంను తన పార్టీలోకి ఆహ్వానించి ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రజనీకాంత్ ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అదే జరిగితే తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ సునామీకి అందరూ గల్లంతు అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Rajinikanth can project senior IAS office Sagayam as his party's CM candidate. As Sagaya has enough experience to correct the government system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X