బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్ కాలా సినిమాకు బ్రేక్: బెంగళూరులో ఒక్క థియేటర్ లేదు, అర్దరాత్రి, పాపం ఫ్యాన్స్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

బెంగళూరులో ఇంకా విడుదల కాని కాలా

బెంగళూరు: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. కాలా సినిమా విడుదల చెయ్యడానికి ప్రముఖ నిర్మాత, పంపిణిదారుడు కనకపుర శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు వృధా అవుతోంది. కాలా సినిమా విడుదల చెయ్యడానికి బెంగళూరులోని సినిమా థియేటర్ల యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. ఉదయం 10.30 గంటలకు షో ప్రారంభం కావలసి ఉన్నా ఇంత వరకూ బెంగళూరుతో పాటు కర్ణాటకలో ఎక్కడా ఒక్క థియేటర్ లో టిక్కెట్లు విక్రయించకపోవడంతో రజనీకాంత్ ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

 అర్దరాత్రి షోలకు బ్రేక్

అర్దరాత్రి షోలకు బ్రేక్


రజనీకాంత్ నటించిన సినిమాలు విడుదల అయితే బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో అర్దరాత్రి నుంచి షోలు ప్రదర్శిస్తారు. అయితే బెంగళూరు నగరంతో సహ మైసూరు. మండ్య, ఆనేకల్, చిక్కబళ్లాపురం, కోలారు తదితర జిల్లాల్లో ఇంత వరకూ కాలా సినిమా ప్రదర్శనకు నోచుకోలేదు.

బెంగళూరులో భయం

బెంగళూరులో భయం

రజనీకాంత్ నటించిన సినిమాలు బెంగళూరులో అధిక సంఖ్యలో ప్రదర్శిస్తారు. రజనీకాంత్ నటించిన సినిమాలు గతంలో విడుదల చేసిన బెంగళూరులోని ప్రముఖ సినిమా థియేటర్లు ఉర్వశి, భూమిక, పూర్ణిమా, అభినయ, నటరాజ్, అంజన్, రేణుకాప్రసన్న తదితర సినిమా థియేటర్లలో ఇప్పటి వరకూ కాలా సినిమా ఒక్క షో కూడా ప్రదర్శించలేదు.

అర్దరాత్రి కన్నడ సంఘాలు

అర్దరాత్రి కన్నడ సంఘాలు

బెంగళూరు నగరంలోని ఉర్వశి, భూమిక, పూర్ణిమా, అభినయ, నటరాజ్, అంజన్, రేణుకాప్రసన్న థియేటర్లతో పాటు కర్ణాటకలో దాదాపు 100 థియేటర్లలో కాలా సినిమా విడుదల అవుతుందని తెలుసుకున్న కన్నడ సంఘాలు అర్దరాత్రి నుంచి పలు సినిమా థియేటర్ల ముందు గుమికూడి టిక్కెట్లు విక్రయించకుండా కాపలా ఉన్నారు.

అభిమానులు మకాం

అభిమానులు మకాం

బెంగళూరు నగరంలోని ఉర్వశి, భూమిక, పూర్ణిమా, అభినయ, నటరాజ్, అంజన్, రేణుకాప్రసన్న థియేటర్లతో పాటు మాల్స్, దగ్గర సినిమా చూడటానికి రజనీకాంత్ అభిమానులు వేచి ఉన్నారు. అయితే కాలా సినిమా ప్రదర్శిస్తే కన్నడ సంఘాలతో లేనిపోని సమస్యలు వస్తాయని సినిమా థియేటర్ల యాజమాన్యం వెనకడుగు వేస్తోంది.

భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

కావేరీ నీటి పంపిణి విషయంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. కాలా సినిమా విడుదలను అడ్డుకోవడానికి కావేరీ నీటి పంపిణిపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలే కారణం. అయితే రజనీకాంత్ ఎంతగా కన్నడ సంఘాలకు మనవి చేసినా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాలా సినిమా విడుదల అయ్యే థియేటర్ల దగ్గర ఎలాంటి అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటకలోని అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలకు ఇంటెలిజెన్స్ ఏడీజీపీ అమర్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

English summary
South India Super Star Rajinikanth Kaala Tamil and Telugu movie is not yet released in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X