వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మంత్రి ఆర్ఎం వీరప్పన్ తో రజనీకాంత్ సమావేశం, రాజకీయాల్లోకి?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎం వీరప్పన్ ను శుక్రవారం నాడు ఆయన ఇంట్లో కలిశారు.తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో మరోసారి ఊపందుక

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎం వీరప్పన్ ను శుక్రవారం నాడు ఆయన ఇంట్లో కలిశారు.

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో మరోసారి ఊపందుకొంది.ఈ ప్రచారం నేపథ్యంలో ఆర్ ఎం వీరప్పన్ తో రజనీకాంత్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఈ నెల 2వ, తేదిన అభిమానులతో రజనీకాంత్ ఏర్పాటు చేసిన సమావేశం కూడ రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై చేసిందనే ప్రచారం కూడ సాగింది.అయితే తాను రాజకీయాల్లోకి రావడం లేదని రజనీకాంత్ ప్రకటించారు.

అయితే ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే వీరప్పన్ తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ విషయమై తమిళనాడు రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.

ఆర్ ఎం వీరప్పన్ తో రజనీకాంత్ సమావేశం

ఆర్ ఎం వీరప్పన్ తో రజనీకాంత్ సమావేశం

తమిళ సూపర్ స్ఠార్ రజనీకాంత్ శుక్రవారం నాడు ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎం వీరప్పన్ తో సుమారు గంటకుపైగా సమావేశమయ్యారు.రజనీకాంత్ కు, వీరప్పన్ కు మధ్య చాలాకాలంగా సత్సంబంధాలున్నాయి.వీరిద్దరు సమావేశం కావడం రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ కూడ మరోసారి ప్రారంభమైంది.

రజనీకాంత్ తో ఆర్ ఎం వీరప్పన్ సినిమాలు

రజనీకాంత్ తో ఆర్ ఎం వీరప్పన్ సినిమాలు

రజనీకాంత్ హీరోగా ఆర్ఎం వీరప్పన్ అనేక హిట్ సినిమాలను నిర్మించారు. మూండ్రముగం, భాషా లాంటి సిమినాలను సత్య మూవీస్ పతాకంపై ఆయన నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్ లో అత్యంత హిట్ సినిమాలు వచ్చాయి. అయితే 1995లో భాషా చిత్ర విజయోత్సవ వేదికపై రజనీకాంత్ అన్నాడిఎంకె పార్టీని తీవ్రంగా విమర్శించారు.

రజనీకాంత్ కారణంగా మంత్రి పదవిని కోల్పోయిన వీరప్పన్

రజనీకాంత్ కారణంగా మంత్రి పదవిని కోల్పోయిన వీరప్పన్

బాషా సినిమా ఫంక్షన్ వేదికపై నుండి అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని రజనీకాంత్ చేసిన ఆరోపణలు ఆనాడు తమిళనాడులో సంచలనంగా మారాయి. జయలలిత మంత్రివర్గంలో ఉన్న వీరప్పన్ పై వేటుపడింది. జయలలిత వీరప్పన్ ను తన మంత్రివర్గం నుండి తొలగించారు.

రజనీకాంత్ అడుగులు ఎటువైపు

రజనీకాంత్ అడుగులు ఎటువైపు

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల మధ్య ఆర్ ఎం వీరప్పన్ ను రజనీకాంత్ కలవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. ఇటీవల బిజెపి రజనీకాంత్ కు గాలం వేయడం, అదే సమయంలో ఆయన అభిమానులు కూడ రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారు.ఈ తరుణంలోనే వీరప్పన్ తో సమావేశం ప్రాధాన్యతను కల్గించింది.

అభిమానులతో వరుస సమావేశాలు

అభిమానులతో వరుస సమావేశాలు

ఈ నెల 12నుండి 17వ, తేది వరకు అభిమానులతో రజనీకాంత్ వరుస సమావేశాలను నిర్వహించనున్నారు.ఈ సమావేశాలు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిని కల్గిస్తోంది.ప్రస్తుతం ఆర్ ఎం వీరప్పన్ , రజనీకాంత్ కలయికలో రాజకీయ పరిణామాలు పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

English summary
Tamil super star Rajinikanth met former minister RM veerappan on friday evening at his residence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X