• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక్క దెబ్బకు సెట్‌రైట్:స్టాలిన్ చెంతకు రజనీకాంత్ -సీఎం కరోనా నిధికి భారీ విరాళం, చియాన్ విక్రమ్ కూడా..

|

'సుదళైతో తలైవా భేటీ'.. 'సుదళై స్టాలిన్‌కు సూపర్‌స్టార్ రజనీ మద్దతు'.. 'చీఫ్ మిస్టర్ స్టాలిన్‌కు తలైవా రజనీకాంత్ కుటుంబం భారీ సహాయం'.. ఇలాంటి వందలకొద్దీ స్టేట్మెంట్లు తమిళనాడు సహా దేశమంతటా కొద్ది గంటలుగా వైరలవుతున్నాయి. జరిగిన విషయం రాజకీయాలకు సంబంధం లేనప్పటికీ రజనీ-స్టాలిన్ కలయిక రాజకీయ కోణంలోనూ హాట్ టాపిక్ అయింది. సరిగ్గా నెల రోజుల ముందు వరకూ కేంద్రంలోని బీజేపీ సర్కారును పొడుగుతూ, ప్రధాని మోదీని నోరారా కీర్తించిన నటుడు రజనీకాంత్ ఇప్పుడు అనివార్యంగానో, మానవత్వంతోనో స్టాలిన్ సర్కారుకు అడగా నిలిచేందుకు ముందుకొచ్చారు..

  MK Stalin - Kabali Daa బొక్కలో వేసి మక్కెలు ఇరగదియ్యాలని ఆదేశాలు..! || Oneindia Telugu

   బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా? బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా?

  సీఎంతో సూపర్‌స్టార్ భేటీ..

  సీఎంతో సూపర్‌స్టార్ భేటీ..

  సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలుసుకున్నారు. చెన్నైలోని రాష్ట్ర సచివాలయానికి వెళ్లిన రజనీ.. కరోనాపై పోరాటంలో తమిళనాడు సర్కారు అనుసరిస్తోన్న విధానాలకు మద్దతు పలికారు. కొవిడ్ నిర్వహణ కోసం ఏర్పాటైన ముఖ్యమంత్రి సహాయ నిధికి రజనీకాంత్ రూ.50 లక్షల భారీ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా..

  ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలుఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  తలైవా ఒక్కసారి చెబితే..

  తలైవా ఒక్కసారి చెబితే..

  సీఎం స్టాలిన్ తో భేటీ, సహాయ నిధికి రూ.50 లక్షల చెక్కు అందజేత తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో కరోనా పరిస్థితులు విషాదకరంగా, విచారకరంగా ఉన్నాయన్న ఆయన.. వైరస్ కట్టడి, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులను, విధించిన ఆంక్షలను ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని, కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతున్నట్లు రజనీకాంత్ చెప్పారు. మరోవైపు నటుడు విక్రమ్‌ కూడా కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు తనవంతు సాయం చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.30లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేశారు. అంతేకాదు,

  చిత్రసీమపై స్టాలిన్ పట్టు..

  చిత్రసీమపై స్టాలిన్ పట్టు..

  కరోనా విలయకాలంలో తమిళనాడు ప్రభుత్వం చెపడుతోన్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని ఎంకే స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. రజనీకాంత్ అల్లుడు విశాఖన్ వనంగ్ ముడి రూ.1 కోటి విరాళం ఇవ్వగా, హీరో అజిత్ రూ.25 లక్షలు, దర్శకుడు మురుగదాస్ రూ.25లక్షలు విరాళంగా ఇచ్చారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పూర్తిగా బీజేపీకి వశమైపోగా, మోదీ, అమిత్ షా లాంటి నేతలు ఎవరొచ్చినా తమిళ సినీ పెద్దలంతా వెళ్లి కలవడం, ఎన్నికలకు ముందు శశికళ జైలు నుంచి విడుదలైన సందర్భంలోనూ సినీ ప్రముఖులు కలవడం తెలిసిందే. తాజా అసెంబ్లీ ఫలితాల్లో డీఎంకే బంపర్ విక్టరీలో అధికారంలోకి రాగా, సినీ రంగంపై స్టాలిన్ మళ్లీ పట్టు బిగించారు. నిజానికి కరోనా విలయం వేళ సహాయాలు, విరాళాలను రాజకీయ కోణంలో చూడటం తప్పే అయినప్పటికీ, స్టాలిన్, రజనీ భేటీ సందర్భంగా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి.

  English summary
  Superstar Rajinikanth met Tamil Nadu Chief Minister MK Stalin at his office in Chennai. The Kaala actor made a donation of Rs 50 lakh to the Chief Minister's Relief Fund as India battles the second wave of coronavirus. After making the donation, the actor addressed the media standing outside. chiyaan vikram and several other film personalities also donate cm relief fund.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X