వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ పార్టీ ఏర్పాటు పనులు జెట్ స్పీడ్ లో .. సైకిల్, పాలక్యాన్ గుర్తుతో తలైవా పార్టీ !!

|
Google Oneindia TeluguNews

2021 సంవత్సరం లో తమిళనాడు రాజకీయాలలో సంచలనం సృష్టించడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల ఆఖరులో పార్టీని ప్రకటిస్తానని, తమిళనాడు రాజకీయాల్లోకి రాబోతున్నానని చెప్పిన రజినీకాంత్ తన పార్టీ ఏవిధంగా ఉండబోతుందో కూడా ప్రకటించారు. ఇక పార్టీ గుర్తు సైకిల్ , పాలక్యాన్ అని నిర్ణయానికి వచ్చారు . కానీ ఇంకా ఫైనల్ చెయ్యలేదు . రజనీకాంత్ తన పార్టీ "అవినీతి రహిత, నిజాయితీ, పారదర్శకత కలిగిన ఆధ్యాత్మిక రాజకీయాలతో కూడిన లౌకిక పార్టీ" అని అన్నారు, ఇది "ఖచ్చితంగా తదుపరి ఎన్నికలలో విజయం సాధిస్తుంది" అని అన్నారు. ఇక పార్టీ ప్రకటన డిసెంబర్ 31 న చేస్తానని తెలిపారు.

'తలైవా' రజనీకాంత్ పార్టీ రిజిస్ట్రేషన్ కు సన్నాహాలు .. తమిళనాట రాజకీయ పార్టీలలో ప్రకంపనలు'తలైవా' రజనీకాంత్ పార్టీ రిజిస్ట్రేషన్ కు సన్నాహాలు .. తమిళనాట రాజకీయ పార్టీలలో ప్రకంపనలు

 పార్టీ కోసం రజనీ అడుగులు .. రాజకీయ సలహాదారుగా తమిళ రవి మణియన్‌

పార్టీ కోసం రజనీ అడుగులు .. రాజకీయ సలహాదారుగా తమిళ రవి మణియన్‌

రజనీకాంత్ తన పార్టీకి సంబంధించి చీఫ్ కోఆర్డినేటర్‌గా బిజెపి స్టేట్ యూనిట్ యొక్క ఇంటలెక్చువల్ విభాగం మాజీ అధ్యక్షుడు అర్జునమూర్తిని పరిచయం చేయడం ద్వారా బీజేపీకి అనుకూలంగా రజినీకాంత్ పార్టీ ఉంటుందా అన్న అనుమానాలకు ఆజ్యం పోశారు. పార్టీని ప్రారంభ సన్నాహాలను పర్యవేక్షించే నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన తమిళ రవి మణియన్‌ను తన రాజకీయ సలహాదారుగా రజనీకాంత్ పరిచయం చేశారు.

పార్టీ విజయవంతమైతే, అది ప్రజల విజయం అన్న తలైవా

పార్టీ విజయవంతమైతే, అది ప్రజల విజయం అన్న తలైవా

డిసెంబర్ 12 న 71 వ ఏట అడుగుపెట్టనున్న రజనీకాంత్ పార్టీని ప్రారంభించాలన్న తన నిర్ణయం తమిళనాడులో మార్పు తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. పార్టీ విజయవంతమైతే, ఇది ప్రజల విజయం అవుతుంది అని అన్నారు. నేను కూడా ఓడిపోతే, అది వారి ఓటమి అవుతుంది. ప్రతిదీ మారుద్దాం. ఇప్పుడు కాకపోతే, అది ఎప్పటికీ మారదు... ఇది తమిళనాడు విధిని మార్చే సమయం. పాలన మారాలి, అని రజనీకాంత్ స్పష్టంగా పేర్కొన్నారు.

పార్టీ గుర్తుపై చర్చ .. సైకిల్ , పాల క్యాన్ గుర్తుతో రజనీ పార్టీ ?

పార్టీ గుర్తుపై చర్చ .. సైకిల్ , పాల క్యాన్ గుర్తుతో రజనీ పార్టీ ?

ఇదే సమయంలో అర్జున్ మూర్తి , తమిళ్ రవి మణియన్ లతోపాటు మక్తల్ మండలం జిల్లా కార్యదర్శులతో భేటీ అయిన రజనీకాంత్ ప్రజలను ఆకట్టుకునేలా పార్టీ ,గుర్తు జెండా ఉండాలని వారితో సమాలోచనలు జరిపారు. పార్టీ చిన్నంగా సైకిల్ ని ఎంచుకోవాలని సమావేశంలో పాల్గొన్న వారు నిర్ణయించగా, ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అదే గుర్తు ఉండడంతో అభ్యంతరాలు వివాదాలు తలెత్తిన కోణంలో వీరు చర్చించారు. అయితే ఇదే సమయంలో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అన్నామలై చిత్రంలో అభిమానులను ఎంతో అలరించిన సైకిల్, పాల క్యాన్, రజిని గెటప్ ను చిహ్నంగా ఎంచుకోవాలని వీరంతా భావిస్తున్నట్టుగా సమాచారం.

 పార్టీకి జిల్లా కార్యదర్శుల నియామకంపై రజినీకాంత్ ఫోకస్

పార్టీకి జిల్లా కార్యదర్శుల నియామకంపై రజినీకాంత్ ఫోకస్

సమావేశంలో పాల్గొన్న వారితో గుర్తు విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై ఫైనల్ నిర్ణయం రజనీకాంత్ అతిత్వరలోనే తీసుకుంటారని పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నెలలో తన రాజకీయ పార్టీని ప్రారంభించాలని ప్రణాళికను ఖరారు చేస్తున్న రజినీకాంత్ పార్టీకి జిల్లా కార్యదర్శుల నియామకంపై సమావేశాలను నిర్వహిస్తున్నారు. గురువారం నాడు ఆర్ ఎం ఎం లోని చెన్నై సెంట్రల్, నార్త్, కాంచీపురం, టుటికోరిన్ జిల్లా యూనిట్ల జిల్లా కార్యదర్శులను కలిశారు. రాఘవేంద్ర మండపంలో శుక్రవారం ఆయన రెండవ బ్యాచ్ జిల్లా కార్యదర్శులను కలుస్తారు.

 సభ్యత్వాలు , బూత్ కమిటీల ఏర్పాటుపై రజనీకాంత్ దృష్టి

సభ్యత్వాలు , బూత్ కమిటీల ఏర్పాటుపై రజనీకాంత్ దృష్టి

చర్చలు ప్రస్తుతం ఉన్న ఆర్‌ఎంఎం మౌలిక సదుపాయాల చుట్టూ కేంద్రీకృతమై సాగుతున్నాయి. బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆర్‌ఎంఎం 2018 జనవరి నుంచి సభ్యత్వ నమోదు చేసి 2018 ఏప్రిల్ నుంచి బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అర్జునమూర్తి మరియు మణియన్ జిల్లా కార్యదర్శులను, బూత్ కమిటీలను రిఫ్రెష్ చేయాలని కోరారు . మరియు మైనారిటీల ప్రతినిధులతో పాటు 5% మహిళలు ఉండాలని ఆదేశించారు. బూత్ కమిటీలలో మహిళా సభ్యులపై కూడా గట్టిగానే దృష్టిసారించారు రజనీకాంత్.

English summary
Superstar Rajinikanth is all set to make a splash in Tamil Nadu politics in 2021. Rajinikanth, and the leaders decided that the symbol was a bicycle and a milk can. But not yet finalized. Rajinikanth said his party was a secular party with spiritual politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X