వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ: తలైవా ఈసారైనా డిసైడ్ అవుతారా? డిసెంబర్ 31న ఏం జరగబోతోంది?

సౌతిండియా సూపర్ స్ఠార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తన అభిమానులతో పలుమార్లు సమావేశమైన ఆయన ఇకనైనా ఈ సస్పెన్స్‌కు తెరదించుతారా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: సౌతిండియా సూపర్ స్ఠార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తన అభిమానులతో పలుమార్లు సమావేశమైన ఆయన ఇకనైనా ఈ సస్పెన్స్‌కు తెరదించుతారా?

తాజాగా రజనీకాంత్.. ప్ర‌ముఖ‌ రాజకీయ వేత్త, రచయిత, తన ఆత్మీయ మిత్రుడైన మణియన్‌తో శుక్రవారం భేటీ కావడం, అనంతరం మణియన్ మీడియాతో మాట్లాడుతూ 'సందేహమెందుకు? ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావడం ఖాయం..' అని ప్రకటించడం చూస్తుంటే.. రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి సమయం ఆసన్నమైందనే తెలుస్తోంది.

ఆ ‘ఒక్కసారి’ ఎప్పుడు?

ఆ ‘ఒక్కసారి’ ఎప్పుడు?

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే' అంటారు. మరి ఆ ఒక్కసారి ఎప్పుడు? ఇదే ఇప్పుడు ఆయన అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. సూపర్‌స్టార్ తన అభిమానులను ఇంకా ఎన్ని రోజులు వెయిటింగ్‌లో పెడతారు. ఈసారైనా తీపి కబురు చెబుతారా? ఆయన రాజకీయాల్లో వస్తారా? రజినీ అభిమానుల రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలిస్తుందా? వాళ్లు తలైవాను సీఎంగా చూస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది కూడా ఆయనే.

డిసెంబర్ 31న ఏం జరగబోతోంది?

డిసెంబర్ 31న ఏం జరగబోతోంది?

రజనీకాంత్ మళ్లీ తన అభిమానులతో సమావేశం కాబోతున్నారు. ఈనెల 26 నుంచి 31 వరకు అభిమానులతో విడతల వారీగా ఆయన సమావేశం అవుతారు. అంతేకాదు, తన రాజకీయ అరంగేట్రానికి ముందు అభిమానులతో ఇదే ఫైనల్ భేటీ అని కూడా తలైవా చెబుతున్నారు. అదే నిజమైతే డిసెంబర్ 31న ఆయన కీలక ప్రకటన చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రజనీకాంత్ తన అభిమానులకు న్యూ ఇయర్ కానుక అందించబోతున్నారా?

యుద్ధం వచ్చినట్లేనా?

యుద్ధం వచ్చినట్లేనా?

రజనీకాంత్ మూడు నెలల క్రితం తన అభిమానులతో భేటీ అయ్యారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని ప్రకటించారు. అంతలోనే మాటమార్చి యుద్ధం వచ్చినప్పుడు కదనరంగంలోకి దూకుదామని పిలుపునిచ్చారు. అంతవరకు ఎవరి పనులు వారు చేసుకోవాలని సూచించారు. యుద్దం అంటే ఎన్నికలే కదా? అప్పటి వరకు ఆగాల్సిందే కదా? అని ఆయన అభిమానులు కూడా కొంత నిరాశ చెందారు. ఇప్పుడు మళ్లీ అభిమానులతో తలైవా తాజాగా సమావేశం కానుండడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

కమల్‌హాసన్ చప్పబడినట్లేనా?

కమల్‌హాసన్ చప్పబడినట్లేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని పదేపదే వాదిస్తున్న తమిళురువి మణియన్‌తో నిన్న స్వయంగా రజనీకాంత్ భేటీ కావడం తాజాగా చర్చనీయాంశమైంది. కేవలం మణియన్‌తోనే కాదు, మరో ఇద్దరు కీలక నేతలతో కూడా తలైవా సమాలోచనలు చేసినట్లు సమాచారం. దీంతో ఆయన రాజకీయ రంగప్రవేశంపై చర్చ మళ్లీ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కమల్ పరిస్థితేంటి? తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి తెగ హడావుడి చేసిన కమల్‌హాసన్ ఆ తరువాత చప్పబడిపోయారు. తమిళ రాజకీయాల్లోకి ఆయనెప్పుడు అరంగేట్రం చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.

రాజకీయాల్లో కమల్ కంటే రజనీయే రాణిస్తారట...

రాజకీయాల్లో కమల్ కంటే రజనీయే రాణిస్తారట...

కమల్‌ హాసన్ కంటే అభిమాన బలం ఎక్కువగా ఉన్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే రాణిస్తారని విశ్లేషకుల వాదన. మరోవైపు సూపర్‌స్టార్ రాజకీయ రంగ ప్రవేశం కోసం అనేక పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఆయనతో పొత్తుపెట్టుకుంటే తమకు లబ్ది చేకూరుతుందని అవి నమ్ముతున్నాయి. ఈ వరుసలో బీజేపీ అందరికంటే ముందుంది. బీజేపీకి భావసారూప్య సంస్థలు రజనీతో టచ్‌లోనే ఉన్నాయి. ఆయన్ని తమవైపుకు లాగేందుకు అవి శతధా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా.. రజనీకాంత్ తన అభిమానులు ఆయన నోటినుంచి వినాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మాట చెబుతారా? సూపర్‌స్టార్ రాజకీయ ఆరంగేట్రం చేస్తారా? డిసెంబర్ 31జరగబోతోంది అదేనా?

English summary
Still there is a suspense continuing on Tamil Super Star Rajinikanth's political entry. Till now as he met many times with his fans. On Friday he personally went to his friend Manian's House and sat with him about 90 minutes and discussed many things including his political entry it seems. Atleast now Rajinikant will put a stop to the speculations on his political entry? On December 31 what Thalaiva is going to tell his fans? Again we have to wait.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X