వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ-కరుణానిధిల స్థానాన్ని రజనీకాంత్ భర్తీ చేస్తారా? అఫ్పుడే 'కావేరీ' ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించిన నేపథ్యంలో తమిళనాట జయలలిత లేని లోటు భర్తీ అవుతుందా, అన్నాడీఎంకే, డీఎంకేలకు ఆయన ప్రత్యామ్నాయంగా ఎదుగుతారా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో రాజకీయ శూన్యత కనిపించింది.

అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఇక్కడ అధికారాన్ని పంచుకుంటున్నాయి. గత ఎన్నికల్లో మాత్రం సంప్రదాయానికి భిన్నంగా మరోసారి తమిళ ప్రజలు జయలలితకు పట్టం కట్టారు. కానీ అంతలోనే ఆమె కన్నుమూశారు. అన్నాడీఎంకేలో గ్రూప్ కొట్లాట, డీఎంకే పగ్గాలు కరుణానిధి నుంచి స్టాలిన్‌కు రావడం వంటి వాటి కారణంగా తమిళ రాజకీయాల్లో రాజకీయ శూన్యత కనిపిస్తోంది.

దళపతిలలో ఎవరిది ఆధిపత్యం

దళపతిలలో ఎవరిది ఆధిపత్యం

జయలలిత, కరుణానిధి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తికర చర్చ తమిళనాట సాగింది. ఇప్పుడు రజనీకాంత్ ఆరంగేట్రంతో ఆయన భర్తీ చేస్తారని భావిస్తున్నారు. దళపతి అని పిలిపించుకునే డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ సినీ దళపతి రజనీని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

రజనీకాంత్ ప్రకటన-పవన్ కళ్యాణ్‌పై తీవ్రవ్యాఖ్యలు: వర్మ సూచన, మహేష్ కత్తి ఘాటుగా రజనీకాంత్ ప్రకటన-పవన్ కళ్యాణ్‌పై తీవ్రవ్యాఖ్యలు: వర్మ సూచన, మహేష్ కత్తి ఘాటుగా

కావేరీ నది వివాదంపై అప్పుడే ప్రశ్న

కావేరీ నది వివాదంపై అప్పుడే ప్రశ్న

నటుడు విజయ్‌కాంత్‌ రాజకీయాల్లో చేరి 2006 ఎన్నికల్లో పది శాతం ఓట్ల వరకు సాధించారు. ఈ ఆదరణ ఆ తర్వాత కనిపించలేదు. అయితే రజనీకాంత్‌కు ఉన్న ఆకర్షణ, సేవలు, మంచితనం వంటివి ఆయనకు మంచి రాజకీయ ప్రస్థానానికి బాటలు వేస్తాయని భావిస్తున్నారు. వివిధ సమస్యలు, అంశాలపై ఆయన వాణి వినిపించాల్సి ఉంది. కావేరి వివాదం ఇతర అంశాలపై ఆయన అభిప్రాయాలను అప్పుడే కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదం కావడం గమనార్హం.

మళ్లీ పోయెస్ గార్డెన్‌కు 'రాజకీయం': ప్రకటనకు ముందు రజనీ ధ్యానం, నాటి నుంచి 'పవర్' వరకు!మళ్లీ పోయెస్ గార్డెన్‌కు 'రాజకీయం': ప్రకటనకు ముందు రజనీ ధ్యానం, నాటి నుంచి 'పవర్' వరకు!

ప్రత్యామ్నాయమా కాదా వేచి చూడాలి

ప్రత్యామ్నాయమా కాదా వేచి చూడాలి

ఆర్కే నగర్‌ ఉపఎన్నికలో విజయం సాధించిన దినకరన్‌ ప్రస్తుత ప్రభుత్వం త్వరలో పడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు స్టాలిన్‌ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ సమయంలోనూ పూర్తికాలం అధికారంలో కొనసాగుతామని అన్నాడీఎంకే ధీమాగా ఉంది. బలమైన ద్రావిడ పార్టీలకు రజనీకాంత్‌ ఎలా ప్రత్యామ్నాయం అవుతారనేది వేచి చూడాలని అంటున్నారు.

సమయం చూసి వచ్చారు

సమయం చూసి వచ్చారు

నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు... సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని రజనీకాంత్ తన సనిమాల్లో చెబుతుంటారు. అది నిజం చేస్తూ ఎన్నో ఏళ్లుగా తన రాజకీయ ఆరంగేట్రంపై చర్చ జరుగుతున్నప్పటికీ ప్రస్తుత రాజకీయాలు చెడిపోయాయని, తమిళనాట రాజకీయాలు ఆధ్వాన్నంగా తయారయ్యాయని, అందుకే తాను వస్తున్నానని సూపర్ స్టార్ చెప్పారు.

లోకసభ ఎన్నికలకు దూరమా

లోకసభ ఎన్నికలకు దూరమా

రజనీకాంత్ 2019 లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన తన పార్టీకి 2020 సమయంలో పార్టీకి నామకరణం చేస్తారని, ఆ తర్వాత 2021 ఎన్నికల బరిలో దిగుతారని చెబుతున్నారు. లోకసభ ఎన్నికలకు దాదాపు మరో ఏడాది మాత్రమే గడువు ఉంది. ఈ కారణంగా ఆయన దూరం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
The hint came in Kabali that was released in 2016. In the movie, Rajinikanth playing Kabali, a veteran don, tells one of the villains after bashing him, to convey a message to his bosses:"Naan Vanthutenu sollu. Thirumbi Vanthutenu. 25 varushathuku munnadi eppadi ponaro Kabali Appadiye thirumbi vanthutaannu solu (Tell them I have returned. And I am just the same like I went away 25 years back)."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X