వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆచితూచి అడుగేస్తున్న ‘తలైవా’.. మెగాస్టార్ అనుభవాలూ ఒక పాఠం.. అవసరమైతే ‘కమల్’ సహకారం..

స్వచ్ఛమైన రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్న నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైపోయినట్లే.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై/ హైదరాబాద్: స్వచ్ఛమైన రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్న నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైపోయినట్లే. అయితే తన రాజకీయ ఆరంగేట్రం, పార్టీ ఏర్పాటు వంటి విషయాలపై రజినీకాంత్ మాత్రం ఆచి తూచి అడుగులేస్తున్నారు.

రాజకీయాల్లోకి రావాలనుకుంటే రజినీకాంత్ కు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ ఒకవైపు బీజేపీ ఆహ్వానం పలుకుతున్నా 'తలైవా' ఏమాత్రం తొందరపడడం లేదు. తన అభిమానుల అభిప్రాయం మేరకే నడుచుకోవాలని భావిస్తూ వారితో భేటీల మీద భేటీలు జరుపుతున్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి అట్టహాసంగా 'ప్రజారాజ్యం' పార్టీ ఏర్పాటు చేయడం, తదనంతర పరిణామాలను కూడా రజినీకాంత్ దృష్టిపథం నుంచి తొలగిపోలేదు. తన రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో గతంలో పార్టీ పెట్టి ఫెయిలైన మెగాస్టార్ రాజకీయ అనుభవాల గురించి కూడా వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతిమ యుద్ధం కోసం...

అంతిమ యుద్ధం కోసం...

మార్పు నినాదంతో అంతిమ యుద్ధం కోసం సిద్ధమవ్వాలని రజినీ తన అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రజినీ రాజకీయ రంగ ప్రవేశానికి తమిళ సూపర్ స్టార్ సిద్ధం అవుతున్నారని అందరూ ఒక అంచనాకు వచ్చేశారు. అయితే రజినీకాంత్ స్థాపించబోయే పార్టీ పేరేంటి? గుర్తేమిటి? ఎప్పుడు ప్రకటిస్తారు? అనే విషయాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకూడదంటూ అప్పుడే తమిళనాట రగడ కూడా మొదలైంది.

అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ...

అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ...

నటులు రాజకీయాల్లో రాణించడం అంటే అది ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితకే చెల్లిందంటారు చాలామంది. ఎందుకంటే, ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి ‘ప్రజారాజ్యం' స్థాపించి ఎలా అభాసుపాలయ్యారన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన' పార్టీతో రాష్ట్ర రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించేందుకు ఉవ్విళ్లూరుతున్నప్పటికీ ఆయన పార్టీని అప్పుడే ఆయన వైరి వర్గం సెటైర్లతో ముంచెత్తడాన్ని కూడా ‘తలైవా' గమనిస్తూనే ఉన్నారు.

మిత్రమా.. సమయం సరైనదేనా?

మిత్రమా.. సమయం సరైనదేనా?

రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎన్నో ఏళ్లుగా కోరుతూనే ఉన్నా ‘తలైవా' మాత్రం ఎన్నడూ తల ఊపలేదు. జయలలిత ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే ఎన్నోమార్లు రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ ఖండిస్తూ వచ్చారు రజినీకాంత్. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఈసారి మాత్్రం రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు. దానికి తోడు ‘దేవుడు ఆదేశించాడు..' అంటూ రజినీకాంత్ వ్యాఖ్యానించడం కూడా ఈ తాజా పరిస్థితికి మరింత బలం చేకూర్చింది.

‘ప్రజారాజ్యం'.. ఒక పెద్ద పాఠం

‘ప్రజారాజ్యం'.. ఒక పెద్ద పాఠం

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి విఫలైమన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్న రజినీకాంత్ కు ఒక పెద్ద పాఠం. చిరంజీవి ‘ప్రజారాజ్యం' స్థాపించిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ విషయం ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో చిరంజీవికున్న అనుభవాల గురించి రజినీకాంత్ వాకబు చేసినట్లు సమాచారం. ప్రజారాజ్యం ఉత్థాన పతనాలపై కూడా ఆయన లోతుగా పరిశీలన జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

అవసరమైతే ‘కమల్' సహకారం కూడా...

అవసరమైతే ‘కమల్' సహకారం కూడా...

తమిళనాడులో తను కూడా ఒకవేళ పార్టీ పెడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశంపై రజినీకాంత్ తన అభిమానులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అవసరమైతే తన సహ నటుడు కమల్ హాసన్ సహకారం కూడా తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారట. మొత్తానికి రజినీకాంత్ స్టయిలే వేరుగా ఉంది. పార్టీ స్థాపించే విషయంలో అందరికంటే ఎక్కువగానే కసరత్తు చేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ?

ఆందోళనతో షాక్.. అయినా..

ఆందోళనతో షాక్.. అయినా..

తన రాజకీయ ఆరంగేట్రానికి వ్యతిరేకంగా సోమవారం జరిగిన ఆందోళనలు చిన్నపాటివే కావడంతో.. రజనీ వాటిని అంతగా పట్టించుకోకపోవచ్చు. సోమవారం ఉదయం కొన్ని తమిళ గ్రూపులు పోయెస్ గార్డెన్ లోని రజనీ ఇంటి వద్ద ఆందోళన చేపట్టాయి. మహారాష్ట్రలో పుట్టిన రజనీకాంత్‌కు తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశం లేదని వారు నినదిస్తున్నారు.
మొత్తానికి తమిళనాడు వ్యాప్తంగా అశేష అభిమానులున్న రజనీకాంత్ .. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బీజేపీకి ‘నో చాన్స్'..

బీజేపీకి ‘నో చాన్స్'..

నిజానికి బీజేపీతో చేతులు కలపాలనుకుంటే.. రద్దయిన ఆర్కేనగర్ ఉపఎన్నిక సందర్భంగా.. రజనీ బీజేపీకి మద్దతు తెలిపేవాడేమో!. అప్పటికీ.. రజనీ ఇమేజ్ ను వాడుకోవాలని ప్రయత్నించిన బీజేపీ.. ఆయన తమకే మద్దతునిస్తున్నాడని ప్రచారం చేసుకుంది. అయితే రజనీ మాత్రం తాను ఏ పార్టీని సమర్థించడం లేదంటూ కుండ బద్దలు కొట్టారు. ఆధ్యాత్మిక భావాలున్న రజనీని.. భావ సారూప్యత పేరుతో బీజేపీ కలుపుకోవాలని చూసినా.. రజనీ ఆ దిశగా ఆలోచించే అవకాశం లేదు. దీనికి కారణం.. ఉత్తరాది పార్టీల పట్ల తమిళనాడులో ఉన్న వ్యతిరేకతే.

English summary
Tamil Super Star Rajinikanth is seriously thinking about on his political entry. He is observing everything very keen about starting of the political party. He is not in a hurry or with egar.. Very slowly and steadily he is stepping forward in this regard. He also taken Telugu Megastar Chiranjeevi's political party Prajarajyam opening and closing show into his mind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X