వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజినీ ‘రోబో 2.0’కు ప్రధాని మోడీ కీలక సూచన: అందుకే ఇక్కడ!

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.0’ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని భారత్‌లోనే చిత్రీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని చిత

|
Google Oneindia TeluguNews

చెన్నై: దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన '2.0' చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని భారత్‌లోనే చిత్రీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సీఓఓ రాజు మహాలింగం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.

'మా గ్రూప్‌ అంతా లండన్‌కి చెందినవారే. కానీ ఈ సినిమా మొత్తం భారత్‌లోనే చిత్రీకరించాం. చెప్పాలంటే ఓసారి మోడీగారే రజనీ సార్‌కి సినిమా భారత్‌లో చిత్రీకరించాలని సలహా ఇచ్చారట. సినిమా క్లైమాక్స్‌ని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో చిత్రీకరించాం' అని వివరించారు.

Rajinikanth's Robot 2.0 is a 'Make in India' movie

అంతేగాక, మిగతా సినిమా మొత్తం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో చిత్రీకరించాంమని వెల్లడించారు. సాధారణంగా సినిమాలు 2-డిలో చిత్రీకరించి ఆ తర్వాత త్రీడిలోకి మారుస్తారు, కానీ ఈ సినిమాని మాత్రం పూర్తిగా త్రీడీలోనే చిత్రీకరించామని చెప్పారు.

'క్రౌచింగ్‌ టైగర్‌ హిడెన్‌ డ్రాగన్‌' అనే చైనీస్‌ చిత్రంలా ఇప్పుడు తాము 2.0 తీశామని మహాలింగం వివరించారు. 2.0లో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటించగా, ప్రతినాయకుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. పలువురు హాలీవుడ్ నిపుణులు కూడా ఈ చిత్రం కోసం పనిచేశారు. ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.

English summary
India's big budget films have a lot of "foreign" in them foreign locales, foreign technical personnel, foreign visual effects (VFX) technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X