చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజినీకాంత్ పార్టీ ఏర్పాటు ఈ ఏడాదే: ఏ నెలలో తెలుసా? అప్పుడే పార్టీ పేరు, పొత్తులపై ప్రకటన!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ఇప్పటికీ ఆసక్తికర చర్చే జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ గత కొంత క్రితమే రజినీకాంత్ ప్రకటించినప్పటికీ.. ఎప్పుడు వస్తారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే, తాజాగా, మరోసారి ఆయన రాజకీయ అరంగేట్రంపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

రజినీకాంత్ పార్టీ ఏర్పాటు..

రజినీకాంత్ పార్టీ ఏర్పాటు..

రజినీకాంత్ తన రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలోనే రజినీకాంత్ తన రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని రజినీ మక్కల్ మండ్రంకు చెందిన నేతలు కూడా ధృవీకరించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అప్పుడే పార్టీపై పేరుపై ప్రకటన..

అప్పుడే పార్టీపై పేరుపై ప్రకటన..

ఇప్పటికే రాజకీయ పార్టీ ఏర్పాట్లపై రజినీ సన్నిహితులు నిమగ్నమైనట్లు తెలిసింది. అయితే, రాజకీయ పార్టీ పేరును రజినీకాంత్ ఇప్పటి వరకు ఖరారు చేయలేదని సమాచారం. ఏప్రిల్ 14 తర్వాత ఎప్పుడైన రజనీకాంత్ తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్నికలకు ఏడాది ముందే పార్టీ ప్రకటన..

ఎన్నికలకు ఏడాది ముందే పార్టీ ప్రకటన..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021 మే నెలలో జరగనున్నాయి. పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏడాది సమయం ఉండటంతో పార్టీని ఏప్రిల్ నెలలోనే ప్రకటించాలని రజినీకాంత్ భావిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే తదితర చిన్న పార్టీలతో రజినీకాంత్ సన్నిహితులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ పార్టీలకు 5-10శాతం ఓటు బ్యాంక్ ఉండటంతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం..

బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం..


కాగా, రజినీకాంత్ బీజేపీతో కూడా పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై రజినీకాంత్ గానీ, ఆయన సన్నిహితులు గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రజినీకాంత్ పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు కూడా రజినీకాంత్ మద్దతు ప్రకటించారు. దేశ రక్షణ కోసం మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తాను సమర్థిస్తానని స్పష్టం చేశారు. తమిళ బీజేపీ నేతలు కూడా రజినీకాంత్‌తో ఇప్పటికే టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి రజినీకాంత్ రాజకీయ పార్టీ, పొత్తులపై ఎలాంటి ప్రకటన చేస్తారనే విషయంపై తెలియాలంటే ఏప్రిల్ వరకూ ఆగాల్సిందేనేమో.

English summary
Shivaji Rao Gaekwad, alias Rajinikanth, 69, waited 22 years to announce his entry into politics after giving a call against then Chief Minister J Jayalalithaa in 1996.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X