వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అంతే: తుగ్లక్ !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తాజాగా ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త, తుగ్గక్ మేగజైన్ ఎడిటర్ గా కొత్తగా నియమితులైన ఎస్. గురుమూర్తి కోరారు. ఇప్పటి పరిస్థితుల్లో తమిళనాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తాజాగా ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త, తుగ్గక్ మేగజైన్ ఎడిటర్ గా కొత్తగా నియమితులైన ఎస్. గురుమూర్తి కోరారు. తమిళనాడుకు రజనీకాంత్ సేవలు అవసరం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తుగ్లక్ మైగజైన్ 47వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త ఎస్. గురుమూర్తి మాట్లాడారు. నేను కోరానుకాబట్టి రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదు, ఆయన సొంత నిర్ణయం తీసుకుని రాజకీయాల్లోకి రావాలని అన్నారు.

అమ్మది రజనీ కాంత్ స్టైల్, శశికళది కమల్ హాసన్ స్టైల్: అన్నాడీఎంకే

తమిళనాడుకు మంచి చేసే వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని మనవి చేశారు. రజనీకాంత్ స్నేహితుడు, తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు చో రామస్వామి గతంలో చాలా సార్లు మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చెప్పిన విషయం గుర్తు చేశారు.

తమిళనాడుకు రజనీకాంత్ అవసరం ఉందని, ఆయన రాజకీయాల్లోకి రావాలని చో రామస్వామి చాలసార్లు చెప్పారని గుర్తుమూర్తి అన్నారు. రజనీకాంత్ విషయంలో తుగ్గక్ పత్రికది, నాది ఇదే అభిప్రాయం అని గుర్తుమూర్తి స్పష్టం చేశారు.

Rajinikanth should join Tamil Nadu politics, says S Gurumurthy

తమిళనాడు రాజకీయాలకు, సినీరంగానికి విడదీయలేని సంబంధం ఉందని, సినీరంగానికి చెందినవారే తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారని ఇదే సందర్బంలో గురుమూర్తి గుర్తు చేశారు.

షాక్: సంక్రాంతికి శశికళ దిమ్మ తిరిగింది: పార్టీలో తిరుగుబాటు !

రజనీకాంత్ కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని, ఆయన మద్దతు కోసం చాలా రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయని అన్నారు. అలాంటి రజనీకాంత్ తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెడితే ఇక్కడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.

1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రజనీకాంత్ చేసిన ఓ వ్యాఖ్య ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ఇదే సందర్బంలో గుర్తుమూర్తి గుర్తు చేశారు.

జయలలితకు ఓటు వేస్తే మిమ్మల్ని ఆదేవుడు కూడా కాపాడలేడని రజనీకాంత్ ఒకేఒక వ్యాఖ్య చెయ్యడంతో ఆమె అధికారం కోల్పోయారని, డీఎంకే కూటమి అధికారంలోకి రావడానికి ఆ వ్యాఖ్య ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారని గురుమూర్తి చెప్పారు.

చిక్కుల్లో అమ్మ క్యాంటీన్లు: రూ. 120 కోట్లు నష్టం, పట్టించుకోని ?

జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయ పరిమాణాలు మారిపోయాయని, ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమిళ ప్రజలు ఎంతో సంతోషిస్తారని తుగ్లక్ పత్రిక ఎడిటర్ ఎస్. గురుమూర్తి అన్నారు.

గత లోక్ సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ రజనీకాంత్ ఇంటికి వెళ్లి మద్దతు కోరిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ మాత్రం తన మనస్సులోని మాట ఇప్పటి వరకు బయటపెట్టలేదు.

తుగ్లక్ పత్రిక ఎడిటర్ ఎస్. గురుమూర్తి చేసిన వ్యాఖ్యలతో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా ? అనే విషయం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతైన తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ అడుగుపెడితే అన్ని పార్టీలకు హడలుపుడుతుందని ఆయన అభిమానులు అంటున్నారు.

English summary
Speaking to reporters following the 47th anniversary of Thuglak magazine and its annual conclave in Chennai, Gurumurthy said, Rajinikanth won’t enter politics just because I want him to. He should take the decision himself. People who will do good for Tamil Nadu should join politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X