వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక కుంభకోణంలో రజినీ: సుబ్రమణ్యస్వామి సంచలనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై భారతీయ జనతా పార్టీ రాజ్యసభసభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై వస్తోన్న వార్తలపై గతంలో కూడా ఆయన తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా, రజినీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు.

'రజనీ నిరక్షరాస్యుడు. ఆయన రాజకీయాలకు సరిపోరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో రజనీకి తెలియదు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే హానికరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది' అని సుబ్రమణ్యస్వామి అన్నారు.

Rajinikanth should not join politics as he’s involved in fraud, says Subramanian Swamy

అందుకే రాజకీయాల్లో రావద్దనే తాను రజినీకి సలహా ఇస్తున్నానని అన్నారు. అంతేగాక, రజినీ ఓ ఆర్థిక కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు.

కాగా, సెప్టెంబరు/ అక్టోబరు నెలలో మరోసారి అభిమానులతో సమావేశమై రాజకీయ రంగ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకుంటానని రజినీకాంత్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిిసందే. అప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని అన్నారు.

English summary
Before Rajinikanth's much-awaited political debut, which in all likelihood is going to happen as the Tamil superstar himself has indicated recently, BJP leader Subramanian Swamy made some serious allegations against him on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X