వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ పార్టీపై సస్పెన్స్ కంటిన్యూ, పార్టీ పేరు, తేదీ ప్రకటించని తలైవా, ఆఫీస్ బేరర్లతో భేటీ..

|
Google Oneindia TeluguNews

రాజకీయ పార్టీ ఏర్పాటుపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మౌనం వీడారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే రెండు పార్టీలే ఉండాలా అని ప్రశ్నించారు. గురువారం చెన్నైలో రజనీ మక్కల్ మండ్రమ్ ఆఫీస్ బేరర్లతో రజనీకాంత్ సమావేశమయ్యారు. అనుచరులతో డిస్కస్ చేశారు. కానీ పార్టీ పేరు, ఎప్పుడూ ప్రకటిస్తాననే విషయంపై సస్పెన్స్ కొనసాగించారు.

Recommended Video

Rajinikanth Set To Launch Party On April 14th | Oneindia Telugu
మూడు ప్రణాళికలు..

మూడు ప్రణాళికలు..

రాజకీయ పార్టీ ఏర్పాటుపై తనకు మూడు ప్రణాళికలు ఉన్నాయని రజనీకాంత్ స్పష్టంచేశారు. రాజకీయాల్లోకి యువరక్తం రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై ఇఫ్పుడు కాదు 2017 డిసెంబర్‌లోనే క్లారిటీ ఇచ్చానని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా సమావేశంలో ప్రదర్శించారు. ప్రభుత్వం, పార్టీపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తాను పార్టీ అధినేతగా మాత్రమే కొనసాగుతానని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రిగా మరో అభ్యర్థి ఉంటారని.. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తాను ఎప్పుడూ ఊహించలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

15 ఏళ్ల నుంచి చర్చ

15 ఏళ్ల నుంచి చర్చ

రాజకీయ పార్టీ ఏర్పాటుపై గత 15 ఏళ్లుగా ప్రచారం జరుగుతోందని రజనీకాంత్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ ఆఫీస్ బేరర్లతో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏప్రిల్ 14వ తేదీ.. అంబేద్కర్ జయంతి సందర్బంగా పార్టీ ఏర్పాటు గురించి ప్రకటిస్తారని రజనీకాంత్ ప్రకటిస్తారని ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం సస్పెన్స్ కొనసాగించారు.

రాజకీయ శూన్యత

రాజకీయ శూన్యత

తమిళనాడులో జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడిందని రజినీకాంత్ చెప్పారు. తనకు మూడు ప్రణాళికలు ఉన్నాయని కబాలి తెలిపారు. రాజకీయాల్లోకి యువరక్తం రావాలని రజినీకాంత్ పిలుపునిచ్చారు. తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పిన రజినీ కాంత్... ప్రజల బాగుకోసమే ఎప్పటికీ కృషి చేస్తానని వెల్లడించారు.

 పరిస్థితుల అంచనా..

పరిస్థితుల అంచనా..

తమిళనాడులో పరిస్థితులను విశ్లేషించడం ప్రారంభించానని రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రజనీకాంత్ పరోక్షంగా అన్నాడీఎంకే, డీఎంకేపై విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల వల్ల తమిళనాడు ప్రజలకు మేలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలతోపాటు ప్రజల మనస్తత్వం కూడా మారాల్సి అవసరం ఉందన్నారు. కానీ రాజకీయ నాయకులకు ప్రజలు అంటే ప్రయోజనాలు, సంక్షేమం కాదని నొక్కి వక్కానించారు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలుగా మాత్రమే చూస్తారని పేర్కొన్నారు.

దుర్వినియోగానికి తావులేదు..

దుర్వినియోగానికి తావులేదు..

వాస్తవానికి సమయానికి తగినట్టు పరిపాలన సాగడం లేదని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. అందుకే సమస్యలు వస్తున్నాయని.. అన్నీ వ్యవస్థలు సమపాలంగా పనిచేస్తే.. ఇబ్బందులు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. తన పార్టీలో అత్యధికులు భాగస్వాములు అయ్యేలా చూసుకుంటానని రజనీకాంత్ స్పష్టంచేశారు. బడుగు, బలహీనవర్గాల సమస్యల కోసం పనిచేస్తామని తేల్చిచెప్పారు. అయితే వనరుల దుర్వినియోగం మాత్రం చేయబోమని, ఆ మాటే తన పార్టీలో ఉండబోదని చెప్పారు.

English summary
Tamil Superstar Rajinikanth is all set to make a political entry. in this backdrop he met with the office bearers and other important people of his potical party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X