వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజినీ! గుడ్ లీడర్: అక్షయ్, మద్దతుగా 234స్థానాల్లో విశాల్ ప్రచారం, రెహమాన్ సపోర్ట్

|
Google Oneindia TeluguNews

చెన్నై/ముంబై: రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌కు తమిళ చిత్ర పరిశ్రమ నుంచే గాక, ఇతర సినీ పరిశ్రమల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ రజనీకాంత్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే.

సంతోషమే: కరుణానిధిని కలిసిన రజినీ, నాశనమేనంటూ స్టాలిన్ సంచలనంసంతోషమే: కరుణానిధిని కలిసిన రజినీ, నాశనమేనంటూ స్టాలిన్ సంచలనం

రజనీకాంత్‌ పార్టీలో రాఘవ లారెన్స్‌ చేరే అవకాశముందని తెలుస్తోంది. కాగా, ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా రజినీ రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వానించారు. ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు విశాల్ కూడా రజినీకి మద్దతు తెలిపారు. కాగా, రజినీ వెబ్ సైట్‌లో ఇప్పటికే 50లక్షలమందికిపైగా సభ్యులు చేరడం విశేషం.

రజినీకి విశాల్ సపోర్ట్

రజినీకి విశాల్ సపోర్ట్

కాగా, తెలుగువాడైన విశాల్‌ తాజాగా రజనీకాంత్‌‌కు మద్దతు పలికారు. రజనీకాంత్‌ కోసం ఓ కార్యకర్తగా పనిచేస్తానని, రజనీ తరఫున 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్‌ తెలిపారు. రాజకీయాలంటే సేవ చేయడమేనని విశాల్‌ పేర్కొన్నారు.

‘రజినీ మండ్రమ్‌.ఓఆర్జీ': ఇది రజినీ తొలి అడుగు, ఫ్యాన్స్‌కు పిలుపు ‘రజినీ మండ్రమ్‌.ఓఆర్జీ': ఇది రజినీ తొలి అడుగు, ఫ్యాన్స్‌కు పిలుపు

విశాల్ మద్దతు కీలకమే..

విశాల్ మద్దతు కీలకమే..

కాగా, రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్‌ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటించి.. రాజకీయాల్లో ముమ్మరంగా పాల్గొనాలని రజినీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాల్‌ మద్దతు రజినీకి లభించడం కీలక పరిణామమనే చెప్పాలి. మొన్నటి ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో పోటీచేసేందుకు విశాల్‌ ఉత్సాహం చూపారు. అయితే, ఎన్నికల సంఘం అతని నామినేషన్‌ను తిరస్కరించడంతో నిరుత్సాహానికి గురైన విశాల్‌.. ఆ ఎన్నికల్లో శశికళ వర్గానికి చెందిన దినకరన్‌కు మద్దతు తెలిపారు. దినకరన్‌ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా విశాల్‌ రజనీ వైపు మొగ్గుచూపుతుండటం తమిళ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

మంచి నాయకుడంటూ అక్షయ్

మంచి నాయకుడంటూ అక్షయ్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోనూ రాణిస్తారని, ఆయనకు అంతా మంచే జరుగుతుందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. మంచి రాజకీయ నేతగా ఆయన ఎదుగుతారని, ఆయన రాణిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

వాళ్ల కాళ్లపై అస్సలు పడొద్దు: ఫ్యాన్స్‌కి రజినీ కీలక సూచనలువాళ్ల కాళ్లపై అస్సలు పడొద్దు: ఫ్యాన్స్‌కి రజినీ కీలక సూచనలు

స్వాగతించిన ఏఆర్ రెహమాన్

స్వాగతించిన ఏఆర్ రెహమాన్

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కూడా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి నటులు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అని ఆయన అన్నారు.

English summary
Akshay Kumar has faith in his "2.0" co-star Rajinikanth as the actor believes the South superstar, who recently took the political plunge, will be "very good" in his new stint as a politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X