వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజినీ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. కమల్‌తో దోస్తికి అడుగులు.. ఆ ‘అద్భుతం’ జరుగుతుందా?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించన నాటి నుంచి ఆ వార్త సంచలనంగా మారింది. ఆయన ఎప్పుడు పార్టీ పెట్టి ఎప్పుడు తమను పిలుస్తాడా? అని ఆయన లక్షలాది అభిమానులు వేచిచూస్తున్నారు. ఆయన పార్టీ ప్రారంభంపై ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ అలా ఏదీ జరగలేదు.

2020లో రజినీ పార్టీ

2020లో రజినీ పార్టీ

తాజాగా, రజినీకాంత్ తన పార్టీని 2020లో ప్రారంభిస్తారని ఆయనకు అత్యంత సన్నిహితుడైన తమిళరువి మణియన్ వెల్లడించారు. రజినీకాంత్ పార్టీ గురించి అధికారికంగా ప్రకటించడానికి తనకు ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ చెబుతున్నానని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు.

ఎన్నికలకు ఏడాది ముందే..

ఎన్నికలకు ఏడాది ముందే..

రజినీకాంత్‌తో ఆయన నివాసంలో భేటీ అనంతరం తమిళరువి మణియన్ ఈ శ్యాఖ్యలు చేయడం గమనార్మం. కాగా, తమిళనాడు రాష్ట్రానికి 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే దాదాపు ఏడాది ముందుగానే రజినీకాంత్ తన పార్టీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అద్భుతాన్ని చూస్తారంటూ రజినీకాంత్..

అద్భుతాన్ని చూస్తారంటూ రజినీకాంత్..

2021లో తమిళనాడు రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతాన్ని ఆవిష్కరిస్తారని ఇటీవల రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ పార్టీ అయిన ఎంఎన్ఎం‌తో కలిసి పనిచేసేందుకు కూడా తాము సిద్ధమన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కూడా సినీరంగం నుంచి వచ్చిన వారే కావడం, మంచి స్నేహితులు కూడా కావడం గమనార్హం.

కమల్ పార్టీతో కలిసి వెళితే.. సీఎం ఎవరు?

కమల్ పార్టీతో కలిసి వెళితే.. సీఎం ఎవరు?


ఒకవేళ కమల్ హాసన్ పార్టీతో కలిసి ఎన్నికల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరుంటారని అడిగిన మీడియా ప్రశ్నకు రజినీకాంత్ సమాధానమిస్తూ.. ఆ విషయంపై ఎన్నికల సమయంలో చర్చిస్తామని అన్నారు. ఈ విషయంపై తాను పెట్టబోయే పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించాల్సి ఉందని చెప్పారు.

ఇక్కడ రజినీ రాజకీయాలు సాగవు..

ఇక్కడ రజినీ రాజకీయాలు సాగవు..

కాగా, రజినీకాంత్ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. ద్రావిడ భూమి అయిన తమిళనాడులో రజినీకాంత్ చేయాలనుకుంటున్న ఆధ్యాత్మిక రాజకీయాలు సాగవని ఏఐఏడీఎంకే నేత వ్యాఖ్యానించాడు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల నుంచి రజినీ, కమల్ పార్టీలకు గట్టి పోటీనే ఎదురుకానుందని చెప్పవచ్చు. తమిళనాడులో పాతుకుపోయిన ఈ రెండు పార్టీలను ఢీకొనడం అంటే మామూలు విషయమేమీ కాదు.

English summary
Tamil superstar Rajinikanth will be entering the political arena in 2020 with the launch of his own party, his close aide Tamilaruvi Manian has claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X