వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ గాంధీ హత్యను ముందే పసిగట్టిన సిఐఏ,23 పేజీల నివేదికలో ఏముంది?

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని సిఐఏ ముందే పసిగట్టింది. 1986లో 23 పేజీల నివేదికను తయారుచేసింది. ఈ నివేదికను సిఐఏ ఇటీవల విడుదల చేసిం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ :భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య గురించి అమెరికా నిఘా సంస్థ సిఐఏ ముందే హెచ్చరించింది.ఈ మేరకు ఆప్టర్ రాజీవ్ పేరుతో 1986 లోనే సిఐఏ 23 పేజీల నివేదిక తయారుచేసింది.ఈ నివేదికను ఇటీవల సిఐఏ బయటపెట్టింది.

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య గురించి అమెరికా నిఘా సంస్థ సిఐఏ ముందే హెచ్చరించింది. ఆయనపై దాడి జరిగే సూచనలున్నాయని ఆ సంస్థ అంచనా వేసింది.

ఇటీవల సిఐఏ తన నివేదికను బయటపెట్టింది . రాజీవ్ గాంధీ పదవికాలం ముగిసే నాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్య ప్రయత్నమే అని సిఐఏ రాసింది. సిఐఏ ఇది రాసిన ఐదేళ్ళకు ఆయన హత్యకు గురయ్యాడు.

rajiv gandhi

1991 మే 21 వ, తేదిన తమిళనాడులోని శ్రీపెంరబుదూర్ లో ఆయన హత్యకు గురయ్యాడు. రాజీవ్ గాంధీ హత్యకు గురైతే ఖచ్చితంగా భారత్కు అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతోందని కూడ సిఐఏ ఆనాడే అంచనావేసింది.

పలు గ్రూపులు రాజీవ్ నుహత్య చేసేందుకు యత్నిస్తున్నాయని , అది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని సిఐఏ రిపోర్టు తెలిపింది. రాజీవ్ లేకుంటే ఆ సమయంలో పివి నరసింహరావు లేదా విపి సింగ్ లాంటి వారు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని సిఐఏ తెలిపింది.

1991లో పివి నరసింహరావు ప్రధానమంత్రిగా బాద్యతలను చేపట్టారు. 1991 లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణంతో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టపోయింది.ఎల్ టి టి ఈ రాజీవ్ ను హత్య చేసింది. శ్రీలంక పర్యటనకు వెళ్ళిన సమయంలో ఆయనపై దాడికి ప్రయత్నిస్తే ఆయన తృటిలో తప్పించుకొన్నారు.

English summary
five years before rajiv gandhi was killed in 1991, the amrica Central intelligence agency had prepared a very detailed and thorough "brief" on what would happen if he is assassinated or makes an "abrupt departure" from the indian political scene.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X